Munawar Faruqui: మునావర్ ఫారూఖీ.. ఈ పేరు నార్త్‌లో చాలా ఫేమస్. స్టాండప్ కామెడీ షోతో పాపులర్ అయ్యాడు. హిందీ బిగ్ బాస్‌లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. 2022 సంవత్సరంలో తెలంగాణలోనూ ఇతని పేరు మార్మోగింది. హిందూ దేవుళ్లను దూషించే మునావర్ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫుల్ ఫైరయ్యారు. అప్పట్లో శిల్ప కళా వేదికలో కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగగా, తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతలో నిర్వహించారు. అప్పటి నుంచి మునావర్ హైదరాబాద్ వైపు చూసింది లేదు. నార్త్ సైడ్ షోలు చేసుకుంటున్నాడు. అయితే, తన రెండో పెళ్లి గురించి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు.
2024లో రెండో పెళ్లి
హిందీ బిగ్ బాస్ 17లో పాల్గొన్న మునావర్ ఆ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే అతను రెండో వివాహం చేసుకున్నాడు. 2024లో మేకప్ ఆర్టిస్ట్ మెహజబీన్ కొట్వాలాతో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి తంతు కొనసాగింది. చాలా సింపుల్‌గా వీరిద్దరి వివాహం జరిగింది. అయితే, వీరి పెళ్లికి సంబంధించిన విషయాలను తాజాగా మునావర్ రివీల్ చేశాడు. మెహజబీన్‌తో తన రిలేషన్ ఎలా ఉంటుందో వివరించాడు. ఆమెను కలిసిన నెల రోజులకే పెళ్లి ఎలా చేసుకున్నాడో, దానికి గల కారణాలను పంచుకున్నాడు.
Read Also- Viral Video: తప్పించుకొని బయటకొచ్చిన సింహం.. రంగంలోకి పోలీసులు
మెహజబీన్‌ను అలా కలిశా..
పెళ్లి గురించి మునావర్‌ను ప్రశ్నించినప్పుడు ‘జిందగీ మే జబ్ సుకూన్ హో నా, తబ్ నూర్ ఆ జాతా హై(జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు ప్రకాశిస్తావు) అని చెప్పాడు. మెహజబీన్‌తో పరిచయం అయిన నెల రోజులకే పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. ‘‘బిగ్ బాస్ 17 ఇంటిలో ఉన్నప్పుడు నాకు వివాహం గురించి ఎటువంటి ఆలోచన లేదు. తర్వాత ప్రకటించిన తర్వాత ప్రజలను నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో నాకు కాబోయే భార్య ఎవరో కూడా తెలియదు. బిగ్ బాస్ విన్నర్ అయ్యాక నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను. ఆ సమయంలో నా కొడుకు మైకేల్ తనను కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యాడు. అప్పుడే రెండో పెళ్లి గురించి ఆలోచన చేశాను. అతడి కోసం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మెహజబీన్ పరిస్థితి కూడా నాలాంటిదే. ఆమెకు పదేళ్ల కుమార్తె ఉన్నది. ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఆమెను కలిసిన నెల రోజులకే పెళ్లి చేసుకుందాం అని అడిగాను. ఆ తర్వాత ఇద్దరం ఒక్కటయ్యాం. మెహజబీన్ కోసం నేను వంట కూడా చేస్తాను’’ అని మునావర్ తన రెండో వివాహానికి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు.
ఇద్దరికీ రెండో పెళ్లే..
మునావర్‌కు గతంలోనే పెళ్లి జరిగింది. 2017లో జాస్మిన్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. 2022లో వీరు విడాకులు తీసుకున్నారు. వీరికి మైకేల్ అనే కుమారుడు ఉన్నాడు. అలాగే మెహజబీన్‌కు పదేళ్ల కుమార్తె ఉన్నది.
Read Also- Pawan Kalyan Sons: ఇద్దరు కొడుకులతో పవన్ కళ్యాణ్.. ఫొటో వైరల్!