Pawan Kalyan Sons: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan).. ఇంతకు ముందు తన ఫ్యామిలీతో రేర్‌గా కనిపించేవారు. కానీ ఎన్నికలలో గెలిచి, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాత్రం తన ఫ్యామిలీతో ఎక్కువగా పబ్లిక్‌లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా తన కుమార్తెలు, కుమారులతో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఏవైనా దూరపు ప్రదేశాలకు, దేవాలయాలకు వెళ్లేటప్పుడు ఆయన వారసులలో ఎవరో ఒకరు పక్కనే ఉంటున్నారు. ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోడీని కలిసే సమయంలో పక్కన కుమారుడు అకీరా నందన్ ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మొక్కులు తీర్చుకునే సమయంలో తన పక్కన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు తన కుమారులిద్దరితో పవన్ కళ్యాణ్ నడిచి వెళుతున్న ఫొటో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి మరి. ఇంతకీ ఈ ఫొటో వెనుక ఉన్న విషయం ఏమిటంటే..
Also Read- Hari Hara Veera Mallu Trailer: బెబ్బులి వేట మొదలైంది.. 24 గంటల్లోనే ‘పుష్ప 2’ రికార్డ్ అవుట్!
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమారులు అకీరా నందన్ (Akira Nandan), మార్క్ శంకర్ (Mark Shankar)లను వెంట బెట్టుకుని మంగళగిరి నివాసానికి వెళుతున్నారు. హెలికాఫ్టర్ దిగి తన కుమారులతో కలిసి వెళుతున్న ఈ ఫొటోలో.. చిన్నవాడి చేయి పట్టుకుని తీసుకెళుతున్న విధానానికి అంతా ఫిదా అవుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్‌ని ఎప్పుడూ కూడా ఇలా చూడలేదు. ఈ మధ్య సింగపూర్ ఘటనలో మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడగా, అక్కడికి వెళ్లి తన కుమారుడిని తీసుకొచ్చేశారు. ఆ సమయంలో కూడా పిల్లాడిని ఎత్తుకునే కనిపించారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీపై ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడేంటా? అని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, ఈ చర్యలతో పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదో గట్టి మెసేజే ఇస్తున్నాడని కూడా కొందరు అనుకుంటూ ఉండటం విశేషం.
Also Read- Allu Arvind: రూ.100 కోట్ల స్కామ్‌లో అల్లు అరవింద్.. ఈడీ ప్రశ్నల వర్షం!
తను ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు తన పిల్లల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మనీ కూడా వాడేశానని పవన్ కళ్యాణ్ చెబుతుంటారు. అలాంటి కష్ట సమయంలో తన కుమారులు, అభిమానులు అండగా నిలబడ్డారు కాబట్టే.. పవన్ కళ్యాణ్ కూడా తన బాధ్యతను నిర్వహిస్తున్నారనేలా టాక్ వినిపిస్తుంది. తన పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా, మంచి చదువు మాత్రం చెప్పిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ విషయంలో పిల్లలకు ఎప్పుడూ సపోర్టివ్‌గానే పవన్ కళ్యాణ్ ఉంటున్నారు. కానీ, ఇద్దరు కుమారులు ఒకే చోట కనిపించడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పుకోవచ్చు. తల్లులు వేరైనా.. తన బిడ్డలపై ఒక తండ్రిగా పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ప్రేమ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందన్నది మాత్రం నిజం. ప్రస్తుతం మెగా అభిమానులందరూ అకీరా ఎంట్రీ కోసం వేచి చూస్తున్నారు. రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఇకపై సినిమాలు చేసే అవకాశం లేదు. ఆ స్థానంలోకి అకీరా రావాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. అన్నీ కలిసి వస్తే ఆ రోజు త్వరలోనే వచ్చే అవకాశం అయితే లేకపోలేదు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు. pic.twitter.com/Jz78eRSWf0
— JanaSena Party (@JanaSenaParty) July 4, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు