Nipah Case
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Nipah virus: టెన్షన్ టెన్షన్.. మరో డేంజర్ కేసు నమోదు

Nipah virus: చాలా ప్రమాదకరమైన నిపా వైరస్ (Nipah viru) కేసు దేశంలో మరొకటి నమోదయింది. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో 38 ఏళ్ల వయసున్న ఓ మహిళకు నిపా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నట్టుక్కల్‌కు చెందిన ఆమెకు ప్రస్తుతం మలప్పురం జిల్లా పెరింతల్‌మన్నలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో శాంపుల్స్ సేకరించి పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. అక్కడ పరీక్షించగా నిఫా వైరస్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా బాధిత మహిళ నివాసం ఉండే గ్రామ సర్పంచ్‌కు సమాచారం అందించారు. ‘‘సదరు మహిళకు నిపా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు జిల్లా కలెక్టర్ నాకు సమాచారం ఇచ్చారు’’ అని స్థానిక పంచాయతీ సర్పంచ్ మహ్మద్ సలీమ్ తెలిపారు.

గ్రామంలో వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్న వ్యక్తులను వేగంగా ట్రాకింగ్ చేయాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించినట్టు వివరించారు. కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. “కలెక్టర్ ఆదేశాలతో గ్రామంలోని వార్డు నంబర్ 8ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మరికొన్ని వార్డులను కూడా పాక్షిక కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఇవన్నీ 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి’’ అని సలీమ్ పేర్కొన్నారు.

Read also- TVK Vijay: సీఎం అభ్యర్థి ప్రకటన.. బీజేపీతో పొత్తుపై విజయ్ సంచలన నిర్ణయం

బాధిత మహిళ తిరిగి ప్రాంతాలు గుర్తింపు
నిఫా వైరస్ సోకిన బాధిత మహిళ ఏయే ప్రాంతాల్లో తిరిగిందో గుర్తించడంపై కూడా అధికారులు దృష్టి సారించారు. జిల్లా వైద్య విభాగం అధికారులు ఇప్పటికే ఆ మహిళ ప్రయాణించిన ప్రాంతాల జాబితాను సిద్ధం చేశారు. బాధిత మహిళను కాంటాక్ట్ అయిన సుమారు 100 మంది వరకు వ్యక్తులకు అధిక ముప్పు కలిగివున్నవారిగా అనుమానిస్తున్నట్టు ఒక అధికారి వెల్లడించారు. నమూనాలు సేకరించి టెస్టుల కోసం పంపించారు. అయితే, పరీక్ష ఫలితాలు రాకముందే మలప్పురం, పాలక్కాడ్, కోజికోడ్‌లలో నిపా వైరస్ ప్రోటోకాల్‌కు సంబంధించిన నిబంధనలను అమలు చేస్తున్నట్టు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ప్రోటోకాల్స్‌లో భాగంగా కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల లక్షణాలను పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయా ప్రాంతాలలోని జనాలకు అవగాహన కల్పించేందుకు 26 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పారు.

Read also- Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ జనరల్ కీలక ప్రకటన

అనుమానిత కేసు
మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి నిపా వైరస్ సోకి ఉండొచ్చని వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. అనుమానిత కేసుగా భావిస్తున్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన నమూనాలను సేకరించి పరీక్షల కోసం ఇప్పటికే పంపించారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. కాగా, నిపా వైరస్ గబ్బిలాలు, పందుల వంటి జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకినవారికి తీవ్రమైన మెదడు వాపు జ్వరం వస్తుంది. అంటువ్యాధి కావడంతో ప్రాధాన్యత ముప్పు ఉన్న వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. నిపా వైరస్ సోకకుండా నివారించే వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. నిర్దిష్ట చికిత్స కూడా లేదు. జ్వరం, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి, వాంతులు, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ సోకినవారిలో 40-75 మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కేరళలో 2018 నుంచి ప్రతి సంవత్సరం నిపా వైరస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గతేడాది 2024లో 2 మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ ఏడాది మే నెలలో 42 ఏళ్ల ఓ మహిళకు పాజిటివ్ వచ్చి కోలుకుంది.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?