Missterious Teaser Launch
ఎంటర్‌టైన్మెంట్

Missterious: ‘రక్త కన్నీరు’ నాగభూషణం మనవడి చిత్ర టీజర్ విడుదల..

Missterious: అలనాటి విలనిజానికి సరికొత్త నిర్వచనం నేర్పిన నటుడు ‘రక్త కన్నీరు’ నాగభూషణం. ఇప్పుడాయన మూడో తరం వారసులు సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఆయన మనవడు అబిద్ భూషణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సహానితో అబిద్ భూషన్ నటించిన చిత్రం ‘మిస్‌టీరియస్’. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా, శివాని కలిసి నిర్మించిన ఈ చిత్రానికి మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజైన రెండు పాటలు ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి. ఈ పాటలతో సినిమా మీద ఉన్న అంచనాలు కూడా పెరిగాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు మేకర్స్.

Also Read- CM Revanth: పదవులను లైట్ తీసుకోవద్దు.. కష్టపడితేనే గుర్తింపు.. సీఎం పవర్‌ఫుల్ స్పీచ్!

ఈ టీజర్ లాంఛ్ కార్యక్రమంలో డైరెక్టర్ మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. సస్పెన్స్ జానర్‌లో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్‌కి సరికొత్త అనుభూతిని ఇస్తుంది. తాజాగా విడుదలైన టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్‌తో సినిమా సక్సెస్‌పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తుంది. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తాం. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతాయి. ఆ అంచనాలకు అందుకునేలా సినిమా ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలమని తెలిపారు.

Also Read- Jr NTR: ఎన్టీఆర్ ను నాలుగు సార్లు రిజెక్ట్ చేసింది.. ఎవరైతే నాకేంటి అంటున్న స్టార్ హీరోయిన్?

నిర్మాతలు ఉషా, శివాని మాట్లాడుతూ.. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. టీజర్ అందరికీ నచ్చడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్‌లో మరిన్ని మంచి సినిమాలతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తాం. త్వరలోనే ట్రైలర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. ఆ తర్వాత సినిమాను కూడా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకొస్తామని అన్నారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్​లుగా నటించిన అబిద్ భూషణ్, రోహిత్ సహాని మాట్లాడుతూ.. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌కి చాలా థాంక్స్, ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్‌కు కూడా మంచి అప్లాజ్ రావడం ఆనందంగా ఉంది. కచ్చితంగా ఈ సినిమా మా అందరికీ గొప్ప సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చారు. రియా కపూర్ (హీరోయిన్), మేఘనా రాజపుత్ (హీరోయిన్), బలరాజ్ వాడి (కన్నడ నటుడు), ఆకునూరి గౌతమ్, భోగిరెడ్డి శ్రీనివాస్, రాజమౌళి(జబర్దస్త్), గడ్డం నవీన్ (జబర్దస్త్), లక్ష్మి, వేణు పోల్సాని తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్న ఇతర తారాగణం. ఈ సినిమాకు ఎమ్ఎల్ రాజా సంగీతం అందిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?