MP Crime: ప్రియుడి కోసం అమ్మాయిగా మారిన అబ్బాయి.. చివరికి!
MP Crime (Image Source: Twitter)
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

MP Crime: ఇదేం దిక్కుమాలిన కేసు.. ప్రియుడి కోసం అమ్మాయిగా మారిన అబ్బాయి.. చివరికి!

MP Crime: సమాజంలో విపరీత పోకడలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు తావిస్తోంది. ప్రియుడి కోసం ఓ అబ్బాయి లింగమార్పిడి చేసుకోవడం.. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు తనను అత్యాచారం చేశాడంటూ అమ్మాయిగా మారిన అబ్బాయి పోలీసులకు చెప్పడం ఆసక్తికరంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ నర్మదాపురం ప్రాంతంలో లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి పెట్టిన కేసు కలకలం రేపింది. ఓ ట్రాన్స్ జెండర్.. తన స్నేహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. లింగమార్పిడి చేసుకునేలా ప్రోత్సహించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. లింగమార్పిడి చేయించుకున్న తర్వాత పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తనను ఇంట్లోనే బంధించి పదే పదే అత్యాచారం చేశాడని బాధితుడు పోలీసులకు తెలిపాడు.

Also Read: Baba Vanga Prediction: 900 సార్లు భూకంపం.. వంగా జోస్యం నిజం కాబోతోందా.. ప్రళయం తప్పదా!

చేతబడితో వశపరుచుకొని..
ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు గత 10ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నారు. కాల క్రమేణా వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అయితే బ్లాక్ మ్యాజిక్ చేసి తనను వశపరుచుకున్నాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఏడీసీపీ) మల్కీత్ సింగ్ తెలిపారు. పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో ఫిర్యాదుదారుడు 2023లో ఇండోర్ లోని ఓ క్లినిక్ లో లింగమార్పిడి చేసుకున్నాడని స్పష్టం చేశారు. అనంతరం 10 రోజుల పాటు నిర్భందించి ఫిర్యాదుదారుపై అత్యాచారం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Also Read This: Gold Rates (04-07-2025): సామాన్యులకు ఇదే మంచి ఛాన్స్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?