3BHK Twitter Review: హీరో సిద్ధార్థ్ నటించిన 3BHK సినిమా ఈ రోజూ రిలీజ్ అయింది. తమిళం, తెలుగు భాషలలో విడుదలైంది. శ్రీ గణేష్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకం పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా ఒక మధ్య తరగతి కుటుంబం సొంత ఇల్లు కొనాలనే కలను చుట్టూ తిరిగే ఫీల్-గుడ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, యోగి బాబు, చైత్ర జె. ఆచార్ ముఖ్య పాత్రల్లో నటించారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ‘U’ సర్టిఫికెట్ జారీ చేసింది.
Also Read: Love Affair: ఒకేసారి ఆరుగురితో లవ్ ఎఫైర్.. యువతికి లైఫ్ లో గుర్తిండిపోయే ఝలక్ ఇచ్చిన అబ్బాయిలు!
3BHK అనేది ఓ సినిమా కాదు.. అదొక సందేశం.. మనకు రోజూ ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. అలాగే చేసే ప్రతి పనిలో విజయం పొందలేము. జీవితంలో ముందుకు వెళ్ళే కొద్దీ ఎదురు దెబ్బలే తగులుతూ ఉంటాయి. ప్రతీ దాంట్లో అపజయం ఎదురవుతూ ఉండొచ్చు.. కానీ ఏదో ఒక రోజు మన కల నిజమవుతుంది. మనకు నిత్యం ఎదురయ్యే సంఘటనలెన్నో ఈ సినిమాలో చూపించారు అంటూ ఓ నెటిజన్ చెప్పుకొచ్చారు.
#3BHK 🎬 In Theatres From Today #3BHKFromToday #3BHKReview pic.twitter.com/iszHQM5RLA
— Goldwin Sharon (@GoldwinSharon) July 4, 2025
Also Read: Medaram Sammakka Sarakka: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026.. తేదీలు ప్రకటించిన పూజారులు!
3BHK ఓ సినిమాని బాగా తీశారు. సినిమా చూసే ప్రతీ ఒక్కరికీ ఏదోక సీన్ కనెక్ట్ అవుతుంటుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు బాగా కనెక్ట్ అవుతుంది. అయితే మరి కొంత డెప్త్‌గా, ఎమోషనల్‌గా తీసి ఉంటే బాగుండేది.. కొన్ని మెమరబుల్ సీన్లతో ఈ చిత్రం చూస్తున్నంత సేపు హాయిగానే అనిపిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
🏠✨ #3BHK Review #3BHKTelugu#3BHKReview
"3BHK" is an emotional, relatable journey of a middle-class family chasing their biggest dream: owning a 3BHK flat.
The story follows Vasudevan (Sarath Kumar), a disciplined and proud father, who believes a bigger home means more… pic.twitter.com/xz1xBxd1Xm
— CinemaPulse360 (@Cinemapulse360) July 4, 2025