Medaram Sammakka Sarakka: తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం (Medaram) జాతర తేదీలను పూజారుల సంఘం బాధ్యులు ఖరారు చేశారు. జనవరి 28 నుంచి జనవరి 31 వరకు మేడారం మహా జాతర జరగనున్నట్లుగా తెలిపారు. 28 జనవరి 2026 బుధవారం సాయంత్రం 6 గంటలకు సారలమ్మ గద్దకు వచ్చుట, గోవిందరాజు (Govinda Raju) పగటిద్దరాజులు గద్దెలకు వచ్చుట. 29 జనవరి 2026 గురువారం సాయంత్రం 6 గంటలకు సమ్మక్క గద్దెకు వచ్చే కార్యక్రమం. 30 జనవరి 2026 శుక్రవారం భక్తులు మొక్కుబడులు సమర్పించుకునే కార్యక్రమము నిర్వహించబడుతుంది.
Also Read: Ranga Reddy District Tahsildar: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్!
2026 సమ్మక్క సారలమ్మ జాతర
31 జనవరి 2026 శనివారం సాయంత్రం 6 గంటలకు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు గోవిందరాజు (Govinda Raju) పగటిద్ద రాజులు తిరిగి వనప్రవేశం కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మాట్లాడుతూ…. 2026 లో జరిగే సమ్మక్క సారలమ్మ (Sammakka Sarakka) మహా జాతరకు రాష్ట్రం నుండే గాక వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మహా జాతర నేపథ్యంలో (Medaram) మేడారంలో అన్ని రకాలుగా వసతులను కల్పించేందుకు సంఘం కృషి చేస్తుందని వివరించారు. గత వందల ఏళ్లుగా ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం గ్రామంలో జరిగే తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన (Sammakka Sarakka) సమ్మక్క సారలమ్మ జాతరకు అశేష జనం వచ్చి విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.
ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు
గతంలో జరిగిన మేడారం జాతరకు భిన్నంగా ఈసారి జాతరలో ప్రజలకు అన్ని రకాల సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. భక్తులు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే మేడారం (Medaram) జాతర పరిసర ప్రాంత పరిసరాలన్ని అభివృద్ధి చేశామన్నారు. నల్లాల దగ్గర నుంచి స్నానాల గదులు, స్నానమాచరించిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు.
అన్ని రకాల సౌకర్యాలు
ప్రతి ఒక్క భక్తుడు (Medaram) మేడారంలో చేసిన ఏర్పాట్లు, వనదేవతలను దర్శించుకుని పులకించిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అధికారులకు విఐపి దర్శనాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు దర్శనానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలను సమకూర్చనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కనివిని ఎరుగని రీతిలో ఈసారి మేడారం జాతరను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక మంత్రి సీతక్క (Seethakka) చొరవతో మేడారం (Medaram) ప్రాంగణమంతా అభివృద్ధి చేసేందుకు పనులు సాగుతున్నాయని వివరించారు.
Also Read: High Court On Shami: పేసర్ షమీకి బిగ్ షాక్.. హైకోర్టు సంచలన తీర్పు.. గట్టి దెబ్బ పడిందిగా!