Rayachoti Terrorists (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Rayachoti Terrorists: రాయచోటి ఉగ్ర కేసు.. 30 బాంబులతో.. 3 నగరాల్లో పేలుళ్లకు కుట్ర!

Rayachoti Terrorists: ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదులు అబూబాకర్ సిద్ధిఖీ, మహమ్మద్ మన్సూర్ అలీలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు బాంబు పేలుళ్లలో నిందిలతులుగా ఉన్న వారిద్దరు రాయచోటిలో ఉన్నట్లు 3 రోజుల క్రితం ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుర్తించింది. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకొని తమిళనాడుకు తరలించింది. వారిద్దరి అరెస్ట్ తర్వాత అన్నమయ్య జిల్లా పోలీసులు అలెర్ట్ అయ్యారు. వారి ఇళ్లల్లో సోదాలు చేసి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

3 నగరాల్లో పేలుళ్లకు కుట్ర
రాయచోటిలోని అబూబకర్‌ సిద్దిఖీ, మహమ్మద్‌ మన్సూర్‌ అలీలను పోలీసులు సోదాలు చేయగా.. షాకింగ్ వస్తువులు బయటపడ్డాయి. పేలుడు పదార్థాలు, బకెట్, సూట్‌కేసు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేసు బాంబులను రాయచోటి డీఎస్పీ కార్యాలయం సమీపంలో ఆక్టోపస్‌ బృందం పోలీసులు నిర్వీర్యం చేశారు. దేశంలోని మూడు ప్రధాన నగరాలతో పాటు రైలు మార్గాలను పేల్చడానికి వారు పన్నాగం పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి వారి ఇళ్లల్లో 3 నగరాలు, రెల్వే నెట్ వర్క్ ల చిత్రపటాలను పోలీసులు గుర్తించారు. దాదాపు 30 బాంబులతో బ్లాస్టులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ తమిళనాడులో వరుస బాంబు పేలుళ్లలో నిందితులుగా ఉన్నారని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు.

ఇద్దరూ సోదరులే!
పట్టుబడిన అబూబాకర్ సిద్ధిఖీ, మహమ్మద్ మన్సూర్ ఇద్దరూ సోదరులుగా దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నారు. వారికి అల్ ఉమా అనే ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తేల్చారు. వారిద్దరు 2011లో భాజపా నేత ఎల్.కే. అద్వానీ రథయాత్ర సందర్భంగా మదురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నిట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అయితే దానిని ముందే గుర్తించి నిర్వీర్యం చేయడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. 1995లో చెన్నైలోని హిందూమున్నా కార్యాలయంపై బాంబు దాడి, 1999లో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూర్, కేరళ ప్రాంతాల్లో వరుసగా ఏడుచోట్ల జరిగి బాంబు పేలుళ్లలో వీరిద్దరు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Telangana: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్లాన్!

20 ఏళ్లుగా రాయచోటిలో మకాం
ఇద్దరు ఉగ్రవాదులు గత 20 ఏళ్లుగా రాయచోటిలో మకాం ఉంటున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. అబూబకర్ సిద్దిఖీ రాయచోటి యువతిని ఐదేళ్ల వివాహం కూడా చేసుకున్నాడని చెప్పారు. వారు ఎవరికీ అనుమానం రాకుండా చీరల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు వారి ఇంట్లో దొరికిన పేలుడు పదార్థాలతో 50-60 బాంబులు తయారు చేయవచ్చని వివరించారు. ప్రస్తుతం తమిళనాడు జైలులో ఉన్న వారిని తీసుకొచ్చి విచారించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఉగ్రవాదులపై రాయచోటీలోనూ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. మరోవైపు అబూబకర్‌ సిద్దిఖీ భార్య సైరాబాను, మన్సూర్ అలీ భార్య షమీంను సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. న్యాయస్థానం వారిద్దిరికి 14 రోజుల రిమాండ్ సైతం విధించింది.

Also Read This: Thammudu Twitter Review: నితిన్ తమ్ముడు ట్విట్టర్ రివ్యూ.. యూత్ స్టార్ హిట్ కొట్టాడా?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?