Formula E Race Case: కేటీఆర్ చెబితేనే ఫార్మూలా ఈ – కార్ రేస్ కంపెనీకి చెల్లింపులు జరిపినట్టుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (Arvind Kumar) ఏసీబీ (ACB) అధికారులతో చెప్పినట్టుగా తెలిసింది. ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కూడా సూచించానని తెలియచేసినట్టు సమాచారం. అయితే, అంతా నేను చూసుకుంటా చెల్లింపులు జరపండని కేటీఆర్ వాట్సాప్ మెసేజ్ పెట్టారని చెప్పినట్టుగా తెలియవచ్చింది. ఆ తరువాతే తాను ఫార్మూలా ఈ – కార్ రేస్ (Formula E – Car Race) కంపెనీకి చెల్లింపులు చేశానని దీంట్లో నా స్వార్థం ఏమీ లేదని వాంగ్మూలం ఇచ్చినట్టుగా సమాచారం.
Also Read:Telangana: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్లాన్!
అప్పట్లో జరిగింది ఇదే..
హైదరాబాద్ (Hyderabad) బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో పెంచుతున్నామని చెప్పుకొని గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫార్మూలా ఈ – కార్ రేస్ (Formula E – Car Race) ను జరిపింది. రెండో సంవత్సరం రేస్ ప్రారంభం కావడానికి ముందే దీని నుంచి స్పాన్సర్స్ తప్పుకొన్నారు. దాంతో అప్పటి బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం హెచ్ఎండీఏ ద్వారా ఫార్మూలా కంపెనీకి చెల్లింపులు జరిపింది. అయితే, ఇది జరిగినప్పుడు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో చెల్లింపులకు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉండగా ఆ పని చేయలేదు. ఇక, 10 కోట్లకు మించి విదేశీ కంపెనీలకు చెల్లింపులు జరపాల్సి వస్తే రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధనను కూడా పట్టించుకోలేదు. 45.71కోట్ల రూపాయలను బ్రిటన్ పౌండ్ల రూపంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ఫార్మూలా ఈ – కార్ రేస్ (Formula E – Car Race) కంపెనీకి చెల్లించింది.
కేటీఆర్ వాంగ్మూలం
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కొలువుదీరాక ఈ వ్యవహారం వెలుగు చూడడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) దీనిపై ఏసీబీ (ACB) విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఏసీబీ (ACB) అధికారులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR) కేటీఆర్‌ను కేసులో ప్రధాన నిందితుడిగా, అప్పట్లో హెచ్ఎండీఏ కమిషనర్‌గా పని చేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను (Arvind Kumar) ఏ2గా, హెచ్ఎండీఏ ఛీఫ్ ఇంజినీర్‌గా పని చేసిన బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొంటూ కేసులు నమోదు చేసింది. ఇటీవలే కేటీఆర్‌ను ఏసీబీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు రెండోసారి ఆయన వాంగ్మూలం తీసుకున్నారు. అరవింద్ కుమార్ ను పిలిపించారు.
అరవింద్ కుమార్ విచారణ
కేటీఆర్ (KTR) ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్‌ను (Arvind Kumar) ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన ఏసీబీ (ACB) అధికారుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ కేటీఆర్ చెప్పిన మేరకే తాను చెల్లింపులు చేశానని చెప్పినట్టుగా తెలిసింది. ఆర్థిక శాఖ ఇతర అనుమతుల గురించి చెప్పానని, అయితే అంతా తాను చూసుకుంటానని కేటీఆర్ చెప్పారని వెల్లడించినట్టు సమాచారం. ఫార్మూలా ఈ – కార్ రేస్ కంపెనీకి చెల్లింపులు జరపాలని కేటీఆర్ (KTR) తనకు వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టారని చెప్పినట్టుగా తెలియవచ్చింది. ఆ తరువాతే తాను ఫార్మూలా ఈ – కార్ రేస్ (Formula E – Car Race) కంపెనీకి చెల్లింపులు జరిపానని వెల్లడించినట్టుగా తెలిసింది. దీంట్లో తన స్వార్థం ఏదీ లేదని చెప్పినట్టుగా సమాచారం. ఇక, మొదటిసారి రేస్ జరిగినప్పుడు స్పాన్సర్‌గా ఉన్న ఎస్ నెక్ట్స్ జెన్‌తో జరిగిన ఒప్పందం, ఆ తరువాత ఆ సంస్థ అగ్రిమెంట్ నుంచి తొలగిన అంశంపై కూడా అరవింద్ కుమార్‌ను (Arvind Kumar) ప్రశ్నించినట్టు సమాచారం.
Also Read: Kavitha: కవిత ఓటమికి కారణం ఎవరు?.. సొంత పార్టీ నేతలా?