Mahesh Kumar Goud( image credit: twiter
Politics

Mahesh Kumar Goud: ఆమెకు బీఆర్ఎస్‌లో సభ్యత్వం ఉందా?.. పీసీసీ చీఫ్​ సంచలన కామెంట్స్!

Mahesh Kumar Goud: ఎమ్మెల్సీ కవిత ఏ పార్టీలో ఉన్నారో, ఆమెకే స్పష్టంగా తెలియని పరిస్థితి ఉన్నదని పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud)  ఎద్దేవా చేశారు.  ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కవిత ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. అసలు ఆమె జాగృతి తరపున రాశారా, బీఆర్ఎస్ (Brs)  తరఫున రాశారా అనేది క్లారిటీ లేదని కొట్టిపారేశారు. ‘నవ్వి పొదురు గాక నాకేమి సిగ్గు’ అన్నట్టు లేఖ ఉన్నదని విమర్శించారు. పదేళ్లు బీఆర్ఎస్(BRS)  అధికారంలో ఉన్నప్పుడు ఏం వెలగబెట్టారు అంటూ ఫైరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు తగ్గించింది కేసీఆర్(KCR) కాదా అంటూ నిలదీశారు. పదేళ్లలో బీసీల గురుంచి కవిత మాట్లాడినట్లు ఒక్క వీడియో క్లిప్ అయినా చూపించగలరా అని ప్రశ్నించారు. రాజకీయ శూన్యంలో ఆమె మనుగడ కోసం బీసీల జపం చేస్తున్నారని విమర్శించారు. బీసీల గురించి మాట్లాడడానికి కవితకు అర్హత లేదన్నారు.

 Also Read: Kavitha: కవిత ఓటమికి కారణం ఎవరు?.. సొంత పార్టీ నేతలా?

ఖర్గే సభపై క్లారిటీ

నేడు లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ (Congress Party) గ్రామ అధ్యక్షుల స్మమేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) పాల్గొంటారన్నారు. గ్రామ మండల, జిల్లా అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు కలిపి దాదాపు 40 వేల మంది హాజరువుతారని వెల్లడించారు. సామాజిక న్యాయ సమర భేరీ పేరిట సభలో కీలక ప్రసంగాలు ఉంటాయన్నారు. గ్రామ అధ్యక్షులకు ఏఐసీసీ (AICC) జాతీయ అధ్యక్షుడు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ పార్టీ (Congress Party)  అండగా ఉంటుందన్నారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, వైద్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ (Congress Party) సొంతమని వ్యాఖ్యానించారు. బీసీల గురుంచి కాంగ్రెస్ పార్టీ (Congress Party) డిక్లరేషన్ విడుదల చేసే సమయంలో కవిత (Kavitha)  లిక్కర్ స్కాంలో జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారని సెటైర్లు వేశారు. నిరుద్యోగుల ఉసురు తగిలి బీఆర్ఎస్ (BRS)  అధికారం కోల్పోయిందని, బీసీ బిల్లు చట్టం చేసి చట్టబద్దత కోసం కేంద్రానికి పంపించామన్నారు.

 Also ReadHyderabad: అడ్డంగా దొరికిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. అతడి బ్యాగులో

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?