The Game Has Begun It's Time To Vote
Politics

Polling: ముగిసిన ప్రచారపర్వం.. నాలుగో విడతలో ఏయే స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి?

Elections: లోక్ సభ నాలుగో విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రెండు రోజుల సైలెంట్ పీరియడ్ ముగిశాక మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలకు, ఏపీలో అసెంబ్లీ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌ సహా ఏడు రాష్ట్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 96 నియోజకవర్గాల కోసం 4264 నామినేషన్లు రాగా.. ఉపసంహరణ తర్వాత 1970 నామినేషన్లు మిగిలాయి. మే 13న ఏయే రాష్ట్రాల్లో.. ఏయే నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయో చూద్దాం.

లోక్ సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో నాలుగో విడతకు సంబంధించి పోలింగ్ జరగనుంది. నాలుగో విడతలో పది రాష్ట్రాల్లోని 96 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో తెలంగాణ నుంచి 17, ఏపీ నుంచి 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అలాగే.. బిహార్‌లోని 5, జమ్ము కశ్మీర్‌లోని 1, మధ్యప్రదేశ్‌లోని 8, ఒడిశాలోని 4, ఉత్తరప్రదేశ్‌లోని 13, పశ్చిమ బెంగాల్‌లోని 8, జార్ఖండ్‌లోని 4 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

96 లోక్ సభ నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: మైకులు బంద్.. రాష్ట్రంలో 144 సెక్షన్

తెలంగాణ(మొత్తం 17 స్థానాలు): ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెల్ల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, భోంగిర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం

ఆంధ్రప్రదేశ్(మొత్తం 25 స్థానాలు): అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, హిందూపురం, తిరుపతి, రాజంపేట్, చిత్తూరు

బీహార్: దర్భంగా, ఉజియార్‌పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్

జమ్మూ కాశ్మీర్: శ్రీనగర్

జార్ఖండ్: సింగ్భూమ్, ఖుంటి, లోహర్దగా, పాలము

మధ్యప్రదేశ్: దేవాస్, ఉజ్జయిని, మందసౌర్, రత్లాం, ధర్, ఇండోర్, ఖర్గోన్, ఖాండ్వా

మహారాష్ట్ర: నందుర్బార్, జల్గావ్, రావెర్, జాల్నా, ఔరంగాబాద్, మావల్, పూణే, షిరూర్, అహ్మద్‌నగర్, షిర్డీ, బీడ్

ఒడిశా: నబరంగ్‌పూర్, బెర్హంపూర్, కోరాపుట్, కలహండి

ఉత్తరప్రదేశ్: షాజహాన్‌పూర్, ఖేరీ, ధౌరాహ్రా, సీతాపూర్, హర్దోయి, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఇటావా, కన్నౌజ్, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రైచ్

పశ్చిమ బెంగాల్: బహరంపూర్, కృష్ణానగర్, రణఘాట్, బర్ధమాన్ పుర్బా, బుర్ద్వాన్-దుర్గాపూర్, అసన్సోల్, బోల్పూర్, బీర్భూమ్

లోక్ సభ ఎన్నికలతోపాటు ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకూ ఇదే విడతలో పోలింగ్ జరుగుతుంది. అలాగే.. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఇదే రోజున జరుగుతుంది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు విడతల్లో జరగనున్నాయి.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?