Anchor Swecha Suicide Case: స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ (BRS) బీఆర్ఎస్ పార్టీ భవన్‌లో నడుస్తున్న న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ (Anchor Swetcha) ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న చిక్కడపల్లి పోలీసులు (Chikkadapalli Police) అన్ని విషయాలను క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌కు రెండు సార్లు వెళ్లి విచారణ చేయడంతో అనేక అనుమానాలకు తావిస్తున్నది. నిందితుడు పూర్ణచందర్ మీడియాలో పని చేసినా, (Santosh Rao) సంతోష్ రావుకు చెందిన గ్రీన్ ఛాలెంజ్‌లో కొనసాగేవాడు. ఈ క్రమంలోనే యాంకర్ స్వేచ్ఛకు (Anchor Swetcha) పూర్ణ(Purna) దగ్గరయ్యాడు.
దీంతో గతంలో అక్కడ జరిగిన వేధింపులపై పోలీసులు (Police) ఆరా తీస్తున్నట్లు సమాచారం. మాజీ ఎంపీ ఒకరు విద్యార్థి నేతగా ఉన్నప్పుడు ఇదే ఛానల్ యాంకర్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అలాగే, ఇటీవల ఇద్దరి ఉద్యోగుల మధ్య సన్నిహిత సంబంధం దాడి వరకు దారి తీసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. ఆ ఇద్దరిని మేనేజ్మెంట్ తొలగించింది కూడా. 10 ఏండ్లు బీఆర్ఎస్ (Brs) అధికారంలో ఉన్నప్పుడు సదరు ఛానల్‌లో పని చేసిన యాంకర్స్ ప్రభుత్వం మారగానే దాదాపు 8 మంది రాజీనామా చేసి వెళ్లిపోయారు.
Also Read: CM Revanth Reddy: పేదల వైద్యం కోసం ఏడాదిన్నరలో రూ.1400 కోట్లు!
దీంతో బీఆర్ఎస్ భవన్‌లో (BRS Bhavan) గతంలో ఏం జరిగింది, ఇంకా ఎవరైనా వేధింపులకు గురవుతున్నారా లాంటి అంశాలపై పోలీసులు (Police) ఫోకస్ పెట్టినట్లు సమాచారం. రాజకీయ పార్టీ నాయకులు కళ్లెదుట నిత్యం యాంకర్స్ ఉండడంపై వర్క్ ప్లేస్‌లో వేధింపులు ఉండకుండా ఉండే అవకాశాలు లేవని జర్నలిస్ట్ సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. గతంలో వేధింపుల సంఘటనలు జరిగితే ఇప్పుడు ఫిర్యాదులు చేసినా పోలీసులు దర్యాప్తు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.
భవన్‌లోనే నిత్యం అనుబంధం
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) లీగల్ సెల్, ఇన్సూరెన్స్, రైతు విభాగం, అడ్మినిస్ట్రేషన్ విభాగాలు కూడా సదరు న్యూస్ ఛానల్‌కు దగ్గరగా ఉంటాయి. అందులోనే కొంతమంది నేతలు గతంలో రాత్రంతా ఉండేవారు. ఉద్యమ సమయంలోనూ ఆశ్రయం పొందేవారు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో కొంతమంది ఆందోళనకారులు షెల్టర్‌గా వాడుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఓ ఛానల్‌పై దాడి కేసులో నిందితులంతా పార్టీ భవన్‌లో తలదాచుకున్నారని వారిని అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆపరేషన్ (BRS Bhavan) బీఆర్ఎస్ భవన్‌గా మారబోతుందా అనే చర్చ మొదలైంది.
కమర్షియల్‌గా వాడుకుంటున్నారా?
ప్రభుత్వం పార్టీని నడిపించుకునేందుకు వీలుగా ఆ భూమిని నామినల్ రేట్‌కు కేటాయించింది. ఆ తర్వాత భవన్ నిర్మాణంతో పాటు ఛానల్‌ను అక్కడే ఏర్పాటు చేశారు. గతంలో ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందినా, బీఆర్ఎస్ (Brs) ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పార్టీ వారైనా అవసరాలకు వాడుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆ ఛానల్‌ను అధికారికంగానే ఆ పార్టీ హెడ్ క్వార్టర్‌లో నడుపుతున్నారు. ఒక వైపు పార్టీ నేతలు, మరో వైపు ఛానల్ మహిళా స్టాఫ్ ఉండడంతో వివాహేతర సంబంధాలు, వేధింపులకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మీడియా, పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది.
సంపత్ ఆసక్తికర వ్యాఖ్యలు
మరోవైపు, కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ (Sampath Kumar)కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీఆర్ఎస్ భవన్‌లో (BRS Bhavan) జరుగుతున్న అంశాలను బయట పెడతానని చెప్పారు. అంతేకాదు, సీఎం (Revanth Reddy) రేవంత్ రెడ్డికి అన్ని వివరాలతో కూడిన నివేదిక అందజేస్తానని అన్నారు. ఇదే సమయంలో పోలీసులు కూడా భవన్‌కు రెండు సార్లు వెళ్లడంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
Also Read: Rajasthan Family: 8 ఏళ్ల బాలుడికి అమ్మాయి గెటప్.. కట్ చేస్తే శవాలుగా తేలిన ఫ్యామిలీ!