GHMC (imagecredit:twitter)
తెలంగాణ

GHMC: అయోమయంలో కార్పొరేటర్లు.. సాగని సహాయక చర్యలు

GHMC: గ్రేటర్ పరిధిలో ఈ సారి వర్షాకాలం సహాయక చర్యలు ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్టు తయారయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందే అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్(GHMC Monsoon Emergency Team) లను సిద్దం చేసుకునేది. ఈ సారి కొందరు ఇంజనీర్ల అవినీతి కక్కుర్తి కారణంగా సహాయ చర్యల్లో వినియోగించాల్సిన మామూలు వాహానాలకు బదులుగా ఇసుజు వాహానాలను మాత్రమే వినియోగించాలన్న నిబంధన పెట్టడంతో ఒక్కో వాహానం నెలసరి అద్దె ఏకంగా రూ.30 వేల నుంచి రూ 63 వేలకు పెంచేయటంతో పాటు కొందరు కాంట్రాక్టర్లకు మాత్రమే పనులను అప్పగించే ప్రయత్నం చేయటం, అని బట్టబయలు కావటంతో ఈ విషయాన్ని గమనించిన మున్సిపల్ శాఖ వర్షాకాలం సహాయక చర్యల బాధ్యతను జీహెచ్ఎంసీ(GHMC) ఇంజనీరింగ్ వింగ్ నుంచి హైడ్రా(Hydraa)కు బదలాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఆ తర్వాత హైడ్రా ఆగమేఘాలపై టెండర్ల ప్రక్రియ చేపట్టి, సుమారు 4800 మంది సిబ్బంది, ఇతర పరికరాలు, వాహానాలతో మాన్సూన్ టీమ్ లను సిద్దం చేసి, మహానగరవాసులకు వానకాలం కష్టాలను తగ్గించేందుకు తనవంతు కృషి చేస్తుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎక్కడా కూడా సహాయక చర్యల్లో హైడ్రాకు సహకరించిన దాఖలాల్లేవు. పైగా హైడ్రాకు బాధ్యతలు అప్పగించటంతో కార్పొరేటర్లు కూడా కొంత అయోమయానికి గురవుతున్నారు. గతంలో తమ ప్రాంతంలో ఎక్కడ వాటర్ లాగింగ్ ఏర్పడిన జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు, ఇంజనీర్లకు వెంటనే ఫోన్లు చేసే కార్పొరేటర్లు, ఇపుడు హైడ్రా లో ఎవరికి ఫోన్ చేయాలి, ఎవర్ని ఆశ్రయించాలన్న క్లారిటీ లేకపోవటంతో కొంత ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిసింది.

అప్పటి నుంచి ఎడముఖం.. పెడముఖం
బాధ్యతలను హైడ్రాకు బదలాయిస్తున్నపుడు సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ(GHMC), జలమండలి, సిటీ పోలీసులు హైడ్రా(Hydraa)కు సహకరించాలని మున్సిపల్ శాఖ సూచించినా, బాధ్యతలను బదలాయించటాన్ని జీర్ణించుకోలేని జీహెచ్ఎంసీ హైడ్రాకు సహకరించటం లేదన్న విషయం తెలిసింది. పైగా గత సంవత్సరం జీహెచ్ఎంసీ చెల్లించిన అద్దెల కన్నా తక్కువ అద్దెలు, మ్యాన్ పవర్ రోజువారీ వేతనాలతో హైడ్రా మాన్సూన్ టీమ్ లను ఏర్పాటు చేసుకుంది. పైగా ఈ సారి మ్యాన్ పవర్ కు గంటల ప్రాతిపదికన రోజువారీ వేతనాలు చెల్లించే నిబంధనను హైడ్రా అమల్లోకి తెచ్చింది. వర్షాకాలం సహాయక చర్యల విషయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ ఎడముఖం పెడముఖంగానే ఉన్నట్లు తెలిసింది.

Also Read: Bhatti Vikramarka: రెసిడెన్షియల్ పాఠశాల భవనాలపై సోలార్ ప్యానల్స్

ఇప్పటి వరకు చెరువులు, కుంటలకు చెందిన వందలాది ఎకరాల స్థలాన్ని కాపాడిన హైడ్రాకు వానాకాలం సహాయక చర్యల అనుభవం లేకపోవటంతో ఎలా నిర్వహిస్తుందోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ హైడ్రా మంగళవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఎప్పటికపుడు వాతావరణ శాఖ(Meteorological Department)తో సమన్వయం చేసుకుంటూ, వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీటిని తోడేసేందుకు రౌండ్ ది క్లాక్ టీమ్(Round The Clock Teams) లు విధులు నిర్వహించేలా ఆదేశాలిచ్చింది.

వచ్చే వేసవిలో పూడికతీత బాధ్యత హైడ్రాదే
వర్షాకాలం సహాయక చర్యల్లో భాగంగా మాన్సూన్ టీమ్ లను ఏర్పాటు చేసి గ్రేటర్ ప్రజలకు వానకాలం కష్టాలను తగ్గించే బాధ్యతలను జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు బదలాయించినపుడే నాలాల్లోని పూడికతీత పనుల బాధ్యతలను కూడా మున్సిపల్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి(Ilambarthi) హైడ్రాకే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చిన్న, మధ్య, భారీ తరహా నాలాలు సుమారు వెయ్యి 3 కిలోమీటర్ల పొడువున ప్రవహిస్తున్నాయి. వీటిల్లోని పూడికతీత పనుల కోసం జీహెచ్ఎంసీ(GHMC) రూ.60 కోట్ల వ్యయంతో 230 పనులకు గాను టెండర్లను ఆహ్వానించగా, కొన్ని పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో రెండోసారి టెండర్ల ప్రక్రియ చేపట్టారు. దీంతో కాస్త ఆలస్యమైంది.

అంతలో వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ, కేవలం 70 శాతం పూడికతీత పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. సగానికి పైగా పూడికతీత పనులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పూర్తి కావటంతో వర్తమాన సంవత్సరం మాత్రమే జీహెచ్ఎంసీ పూడికతీత పనులు పూర్తి చేయాలని, వచ్చే వర్షాకాలానికి ముందు వేసవి కాలంలోనే నాలాల పూడికతీత పనులను హైడ్రా పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీలోని ఇంజనీరింగ్ విభాగంలోని కొందరు అక్రమార్కుల కాంట్రాక్టర్లతో మిలాఖత్ కు, పనుల్లో అవినీతికి బ్రేక్ పడినట్టయింది. ఇది జీర్ణించుకోలేకనే కొందరు ఇంజనీర్లు హైడ్రా వర్షాకాల సహాయక చర్యలను పట్టించుకోవటం లేదని బల్దియాలో చర్చ జరుగుతుంది.

Also Read: Illegal Assets Cases: గత నెలలో 31 కేసులు కోట్లలో అక్రమాస్తుల గుర్తింపు!

 

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు