Shirish Reddy: నితిన్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ (Thammudu) చిత్ర ప్రమోషన్స్‌లో ఎక్కువగా ‘గేమ్ ఛేంజర్’ ప్రస్తావనే వస్తుంది. ముఖ్యంగా దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి.. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) రిజల్ట్ తర్వాత కనీసం హీరో, దర్శకుడు ఫోన్ కూడా చేయలేదంటూ కామెంట్స్ చేసి.. పెద్ద కాంట్రవర్సీకి తెరలేపారు. ఆ మాటలు విన్న మెగా ఫ్యాన్స్ వారి బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఎదురుదాడికి దిగారు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమా తర్వాత మీకు డేట్స్ ఇవ్వడమే ఎక్కువ. ఇంకా 3 సంవత్సరాలపాటు లాక్ చేసి ఇబ్బంది పెట్టింది కాకుండా.. పైగా ఈ మాటలా? అంటూ స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. గతంలో కొన్ని సినిమా ఫ్లాప్ అయినా, ఏ నిర్మాత ఇలా మాట్లాడలేదంటూ ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. ఇకపై ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలను బాయ్‌కాట్ చేయాలని పిలుపు నివ్వడంతో.. నిర్మాతలు దిగిరాక తప్పలేదు. మధ్యలో దిల్ రాజు (Dil Raju) కలగజేసుకుని డ్యామేజ్‌ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా, మెగా ఫ్యాన్స్ తగ్గలేదు. దీంతో స్వయంగా ఆ మాటలు అన్నటువంటి శిరీష్ దిగిరాక తప్పలేదు.
ఆల్రెడీ క్షమాపణలు కోరుతూ ఓ లేఖను విడుదల చేసిన శిరీష్.. తాజాగా ఓ వీడియో మెసేజ్ ద్వారా మెగా అభిమానులకు సారీ చెప్పారు. ఈ వీడియో ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినీ ప్రేక్షకులకు, మెగా అభిమానులకు ఈ సందర్భంగా ఓ విషయం చెప్పదలచుకున్నాను. మా ఎస్వీసీ సంస్థకు.. రామ్ చరణ్ (Ram Charan), చిరంజీవి (Chiranjeevi)లతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా చరణ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నేను అభిమానించే హీరోల్లో ఆయన కూడా ఒకరు. ఆయన్ని అవమానపరచడం గాని, కించపరచడం గాని నా జన్మలో ఎప్పుడూ చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొర్లింది.. అది నా తప్పే. అలా అనడం చరణ్‌ను అవమానించినట్లు అయిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి.. నిజంగానే క్షమాపణలు చెబుతున్నాను. చరణ్‌కు కూడా క్షమాపణలు చెబుతున్నాను.
Also Read- Harshali Malhotra: ‘అఖండ 2’లో ‘బజరంగీ భాయిజాన్’ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడెలా ఉందో చూశారా?
రామ్ చరణ్‌తో నాకు ఉన్నటువంటి రిలేషన్‌షిప్‌ను పాడుచేసుకోదల్చుకోలేదు. ఈరోజు జనం ఆ ఘటనపై మాట్లాడుకుంటున్న మాటలు, బయట ట్రోలింగ్, అభిమానుల బాధలు నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒక హీరోని అలా అన్నప్పుడు నిజంగానే ఎవరూ భరించలేరు. కానీ, నేను అన్న ఇంటెన్షన్ అది కాదు.. మాకున్న రిలేషన్‌షిప్ కొద్ది క్లోజ్‌నెస్‌లో నేనొక మాట దొర్లాను తప్ప.. ఆయన్ని అవమానపరచడానికి కాదని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మెగా హీరోలందరితోనూ మాకు మంచి అనుబంధం ఉంది. వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ చేశాం. సాయి తేజ్‌తో రెండు సినిమాలు చేశాం. చరణ్‌తో రెండు సినిమాలు చేశాం. మెగాస్టార్ ఎప్పుడూ దిల్ రాజుతోనూ, మాతోనూ మాట్లాడుతూనే ఉంటారు. ఇంత మంచి అనుబంధం ఉన్నవారిని అవమానపరిచేంత మూర్ఖుడిని కాదు. దయచేసి అభిమానులందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.
Also Read- Dil Raju: నితిన్‌ను అల్లు అర్జున్‌తో పోల్చానని.. నెగిటివ్‌గా చూడొద్దు
సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా.. చరణ్ ఒప్పుకోకపోతే ఆ సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఆయన మనసు గొప్పది కాబట్టి.. ఆ సినిమాను కూడా రిలీజ్ చేసుకోండని ఒక గొప్ప మనసుతో ఒప్పుకున్న వ్యక్తి చరణ్. అలాంటి గొప్ప వ్యక్తిని ఎందుకు అవమాన పరుస్తాం. నా మాటల్ని అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాను. ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి మా రిలేషన్‌ను పాడు చేయవద్దు. మళ్లీ నెక్స్ట్ ఒక ప్రాజెక్టు చరణ్‌తో చేయబోతున్నాం. మా ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు తీసుకురావద్దని అందర్నీ వేడుకుంటున్నాను. తెలుగు ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. నాకు చరణ్‌తో మంచి రిలేషన్ ఉంది. ఆయన గురించి నేను ఎప్పుడూ తప్పుగా మాట్లాడను. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను కాబట్టి, నాకు తెలియకుండా ఏదైనా మాట దొర్లిందేమో. అది కూడా అర్థం చేసుకోవాలని అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.
Official statement from our Producer Shirish Garu. pic.twitter.com/I4mv9r18w7
— Sri Venkateswara Creations (@SVC_official) July 2, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు