Naga Chaitanya ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Naga Chaitanya: నాగ చైతన్య రియల్ లైఫ్ లోనే కాకుండా సినీ కెరీర్ లో కూడా అంత పెద్ద తప్పు చేశాడా?

Naga Chaitanya: ఒక సినిమా కథను వదులుకుంటే “అబ్బా, ఏమీ కాదులే అనుకోవచ్చు”. రెండు సినిమాలు వదులుకుంటే “సరే, అంతగా బాగోలేదేమో” అనుకోవచ్చు. కానీ ఏకంగా ఐదు సినిమాల కథలు విని, వాటిని వదులుకోవడం ఏమనాలి? ఈ ప్రశ్నకు తెలుగు సినీ ఇండస్ట్రీలో సమాధానం చెప్పగలిగే వారు ఇద్దరే ఇద్దరూ ఉన్నారు. ఒకరు అక్కినేని నాగార్జున కొడుకు హీరో నాగచైతన్య, ఇంకొకరు దర్శకుడు వెంకీ అట్లూరి. ఎందుకంటే, ఈ ఐదు చిత్రాల కథల విషయంలో ఈ ఇద్దరి మధ్యే జరిగిన సంభాషణలు ఆసక్తికరం. వెంకీ అట్లూరి తన సినిమా కథలన్నింటినీ నాగచైతన్యకు చెప్పినట్లు స్వయంగా వెల్లడించారు. కానీ, ఆ కథలు ఏవీ సినిమాగా రూపుదిద్దుకోలేదని చెప్పారు.

Also Read: Adivi Sesh: ‘డకాయిట్’ నుంచి శృతి హాసన్ ఎందుకు తప్పుకుందంటే.. అసలు విషయం చెప్పేసిన శేష్!

వెంకీ అట్లూరి తన తొలి చిత్రం ‘తొలిప్రేమ’ను వరుణ్‌తేజ్‌తో తీశారు . ఆ హిట్ అయింది. ఆ తర్వాత ‘మిస్టర్‌ మజ్ను’ చేయగా, ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మూడో చిత్రం నితిన్‌ హీరోగా ‘రంగే దే’ తెరకెక్కించాడు. ఈ చిత్రం కూడా ఫ్లాప్ గా నిలిచింది. నాలుగో చిత్రం ‘సార్‌’ ధనుష్‌ తీసి పెద్ద హిట్ కొట్టాడు. ఐదో చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ దుల్కర్‌ సల్మాన్‌తో తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ ఐదు సినిమాల కథలను అందరికంటే ముందుగా వెంకీ అట్లూరి నాగచైతన్యకు చెప్పారట. అయితే, డేట్స్ కుదరకపోవడం వలన సినిమాలు చేయలేదు.

Also Read:  Samantha and Raj Nidimoru: సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. త్వరలోనే అఫీషియల్‌ ప్రకటన?

ప్రస్తుతం, నాగ  చైతన్య కార్తిక్‌ దండు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ట్రెజర్‌ హంట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘వృష ఖర్మ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత వెంకీ అట్లూరి మళ్లీ చైతన్యకు కథ చెప్పే అవకాశం ఉందేమో చూడాలి!

Also Read: Ram Charan: రామ్ చరణ్ వాళ్ళకి అంత బాధను మిగిల్చాడా.. గేమ్ ఛేంజర్ నిర్మాత సంచలన కామెంట్స్

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు