Shirish Reddy apology
ఎంటర్‌టైన్మెంట్

Shirish Reddy: క్షమించండి.. మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇకపై మాట్లాడం!

Shirish Reddy: ‘గేమ్ ఛేంజర్’ గురించి ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌పై చేసిన వ్యాఖ్యలకు నిర్మాత శిరీష్ రెడ్డి సారీ చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ ఎలా ఉన్నా, హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కనీసం ఫోన్ కూడా చేసి మాట్లాడలేదని.. దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కామెంట్స్‌‌తో ఇండస్ట్రీలో పెద్ద దుమారమే చెలరేగుతుంది. మెగా ఫ్యాన్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కు వార్నింగ్ ఇస్తూ ఓ లేఖను కూడా విడుదల చేశారు. రెండు రోజుల్లో ఈ బ్యానర్ నుంచి నితిన్ నటించిన సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎంత సహనంగా మాట్లాడితే అంత మంచిది. అలాంటి శిరీష్ కంట్రోల్ తప్పి మరీ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో.. మెగాభిమానులు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ దెబ్బకు శిరీష్ రెడ్డి దిగి రాక తప్పలేదు. మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇకపై మాట్లాడం.. అంటూ శిరీష్ రెడ్డి ఓ లేఖను విడుదల చేశారు. మరి ఈ లేఖతో అయినా అభిమానులు శాంతిస్తారా? అనేది చూడాల్సి ఉంది.

Also Read- Boycott SVC Movies: శిరీష్ కామెంట్స్‌తో.. మెగా ఫ్యాన్స్ సంచలన నిర్ణయం!

శిరీష్ రెడ్డి తన లేఖలో.. ‘‘నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు.. సోషల్ మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారి తీసి, దాని వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం మాకు ‘గ్లోబల్ స్టార్ రామ్ చరణ్’ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి, రామ్ చరణ్ ఇంకా మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలనైనా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే.. క్షమించండి’’ అని పేర్కొన్నారు. మరి ఈ లేఖ తర్వాత మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. మొత్తానికి అయితే, మెగా అభిమానులను గెలికితే ఎలా ఉంటుందో.. అనేది ఈ దెబ్బతో ఇండస్ట్రీకి తెలిసి వచ్చి ఉంటుందని ఫ్యాన్స్ కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Also Read- Fish Venkat: బ్రేకింగ్.. ఐసీయూలో గబ్బర్ సింగ్ నటుడు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో

అసలేం జరిగిందంటే.. ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఎస్వీసీ నిర్మాతలలో ఒకరైన శిరీష్ రెడ్డి ఓ వెబ్ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’ ప్రస్తావన రావడంతో.. ఆయన బరస్ట్ అయ్యారు. ఆ సినిమాతో భారీగా లాస్ వచ్చి, మేము ఇబ్బంది పడుతుంటే.. అటు హీరోగానీ, ఇటు దర్శకుడుగానీ కనీసం ఫోన్ చేసి కూడా ఎలా ఉన్నారని అడగలేదు అని చెప్పుకొచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతూ.. ఎవరి కారణంగా ఎవరు లాస్ అయ్యారో మొత్తం లెక్కలు బయటపెట్టి మరీ నిర్మాతలని ట్రోల్ చేస్తున్నారు. దీంతో శిరీష్ క్షమాపణలు చెబుతూ లేఖను విడుదల చేశారు.

Shirish Letter
Shirish Letter

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..