Fish Venkat: ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చే సినిమాల్లో కామెడీతో అలరించే నటుడు ఫిష్ వెంకట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఐసీయూలో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనస్థితిలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ, వైద్య ఖర్చుల కోసం డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కిడ్నీ సమస్యల కారణంగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బీపీ, షుగర్ సమస్యల వల్ల ఆయన కాలికి ఇన్ఫెక్షన్ సోకింది. తాను గతంలో ఎందరికో సాయం చేశానని, కానీ ఇప్పుడు వైద్య ఖర్చుల కోసం కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నానని ఫిష్ వెంకట్ ఎమోషనల్ అవుతూ చెప్పారు. రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.
ఆయన పరిస్థితిని చూసి నెటిజన్లు చలించిపోతూ, ఆయనకు సాయం చేయాలని ప్రభుత్వానికి, తెలుగు సినీ హీరోలకు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.