Jurala Reservoir (imacredit:swetcha)
తెలంగాణ

Jurala Reservoir: సాగునీటి ప్రాజెక్టులకు రానున్న మంచి రోజులు

Jurala Reservoir: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల రిజర్వాయర్కు(Jurala Reservoir) ఉమ్మడి పాలమూరుకు వర ప్రధాయినిగా పేరుంది 1981లో నిర్మించిన జూరాల ప్రాజెక్టు అప్పటి సామర్థ్యానికి అనుగుణంగా ప్రాజెక్టు రూపకల్పన కార్యరూపం దాల్చకపోవడంతో 18 టీఎంసీ(TMC)ల నిల్వకు గాను కేవలం 9.657 టీఎంసీల సామర్థ్యం మేరకు నీరు నిల్వ ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణానంతరం నుంచి నేటి వరకు జూరాలలో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో సిల్ట్ పేరుకుపోయి లక్ష్యం మేరకు నీరు నిల్వ ఉండడం లేదు. ఫలితంగా నిర్దేశించిన ఆయకట్టుకు సాగునీరు, వేసవిలో మిషన్ భగీరథ పథకం ద్వారా త్రాగునీరు సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

దీంతో జూరాల జలాశయంలో నీటి నిల్వలు అడుగంటడంతో ఎగవనున్న కర్ణాటక(Karnataka) రాష్ట్రంపై ఆధారపడాల్సి వస్తోంది. అంతేగాక జూరాల డాంను 1981లో నిర్మించగా నిర్మించిన బ్రిడ్జిపై కేవలం 20 టన్నుల మేరకు వాహనాల రాకపోకలు చేయాల్సి ఉండగా 40 టన్నులకు పైగా బరువున్న భారీ వాహనాలు జూరాల డాం మీదుగా రాకపోకలు చేయడంతో బ్రిడ్జికి పగుళ్లు తలెత్తాయి. డ్యాంకు 62 గేట్లు ఉండగా వాటిలో కొన్ని గేట్లు సకాలంలో మరమ్మతులు చోటుచేసుకోకపోవడంతో ఇటీవల ఐరన్ రోప్ లు తెగిపోవడంతో ప్రభుత్వం స్పందించింది. ఈ మేర రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) జూరాల ప్రాజెక్టును సందర్శించి డ్యామ్ నిర్వహణ తీరును పరిశీలించారు. పలు హామీలు ఇచ్చారు.

నెట్టెంపాడు అసంపూర్తి పనులకు 2,375 కోట్లు

నెట్టెంపాడు ప్రాజెక్టు(Nettempadu Project)లో భాగంగా పలు అసంపూర్తి పనులకు 2,375 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా జూరాల డాం(Jurala Dam) వంతెనపై అదనపు భారం పడకుండా నూతన బ్రిడ్జి నిర్మాణానికి 100 కోట్లు కేటాయించారు. అదేవిధంగా 62 గేట్ల నిర్వహణ నిమిత్తం 3.5 కోట్లతో గ్యాంటీ క్రేన్ ఏర్పాటు కోసం మంత్రి హామీ ఇచ్చారు.

Also Read: Bhadradri Kothagudem: ఈ జర్నలిస్ట్ నిజంగా దేవుడు.. నేను ఉన్నానంటూ హమీ

ర్యాలంపాడు రిజర్వాయర్ 4 టిఎంసిలకు కృషి

ర్యాలంపాడు రిజర్వాయర్(Ryalampadu Reservoir)లో నాలుగు టిఎంసి(TMC)ల నీటిని విలువ సామర్ధ్యం కోసం పనులు చేపడతామన్నారు. అయితే ఇప్పటికే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్ గత ఆరు సంవత్సరాలుగా ఆనకట్టకు బుంగలు పడి నీటి లీకేజీలు కావడంపై సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో పలుమార్లు సాంకేతిక నిపుణులు రిజర్వాయర్ ఆనకట్ట(Dam)ను పరిశీలిస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు సూచించడం లేదు. ఇటీవల మంత్రి ఇచ్చిన హామీతో 1.20 లక్షల ఎకరాలలో సాగు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. అదేవిధంగా జూరాల ఆయకట్టు స్థిరీకరణ కింద 1.2 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారు. జూరాల, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 3.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

జూరాల పూడికతీతకు చర్యలు

ఉమ్మడి పాలమూరు(Palamuru District) జిల్లాకు వరదప్రదాయనిగా ఉన్న జూరాల జలాశయంలో పేరుకుపోయిన పూడికతీతను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. వాస్తవానికి జూరాల నీటి నిలువ సామర్థ్యం 9.657 టీఎంసీల సామర్థ్యం ఎన్నో ఏళ్లుగా పూడికతీత పనులు చేపట్టకపోవడంతో ఐదు నుంచి ఆరు టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. పూడికతీత చర్యలు చేపడితే ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్ లో నుంచి వచ్చే నీటిని వేసవి కాలంలో రబీ పంటలు తాగునీటి అవసరాల కోసం అదనపు టిఎంసిలు నిలువ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇరిగేషన్ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అనేక ప్రభుత్వాలు మారిన జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సాధించకపోవడంతో సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. హామీలను ఆచరణ రూపం దాల్చితే సాగునీటిపరంగా జిల్లా సస్యశ్యామలమవుతుందని ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

Also Read: Pasamailaram Blast: పాశమైలారం ఘటన.. తెరపైకి గుండెలు పిండేసే విషాద గాధలు!

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?