MLA Veerlapalli Shankar: షాద్ నగర్ నియోజకవర్గంలో నిరుపేద రైతుల భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని మోసం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్(Veerlapally Shankar) హెచ్చరించారు. షాద్ నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన భూ బాధితులు కొత్తపల్లి నరసింహారెడ్డి, వినోదలు కలుసుకున్నారు. మోసపూరిత పద్ధతిలో తమ పేరిట ఉన్న భూములను గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి అతని తండ్రి సుభాన్ రెడ్డి మరికొందరు అక్రమ పద్ధతులతో పట్టా మార్పిడి చేయించడంతో వారు కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేను కలిసి న్యాయం చేయాలని కోరారు.
మోసానికి గురైన కొత్తపల్లి వాసులు
ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవ చూపగా స్థానిక ఆర్డిఓ సరిత(RDO Saritha), ఫరూక్ నగర్ తహసిల్దార్ పార్థసారథి తదితరులు బాధితులకు సహకారం అందించే విధంగా పట్టా మార్పిడి విషయంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి(Narayana Reddy)తో మాట్లాడి మోసానికి గురైన కొత్తపల్లి వినోద కొత్తపల్లి నరసింహారెడ్డి భూమిని తిరిగి వారికి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో సదరు బాధిత రైతులు ఎమ్మెల్యేను కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Chandrababu: చంద్రబాబు అసహ్యించుకున్న ఆ 15 మంది ఎమ్మెల్యేలు ఎవరు?
ఎవరికీ అన్యాయం జరగనివ్వం
అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం పట్ల చిలకమర్రి గ్రామ రైతు కాంగ్రెస్ నాయకుడు రవీందర్ రెడ్డి(Ravindhar Reddy) తదితరులు గ్రామస్తుల తరఫున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు చేసిన మేలు జీవితంలో వారు మర్చిపోలేని పేర్కొన్నారు. ఎవరికీ ఏ అన్యాయం జరగనివ్వనని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారికి స్పష్టం చేశారు. నిరుపేద రైతాంగాన్ని మోసం చేస్తే సహించనని ఈ విషయంలో మోసానికి పాల్పడ్డ ఎంతటి వారైనా కఠినంగా చర్యలు ఎదుర్కొక తప్పదని పేర్కొన్నారు. చట్టం తన పని చేసుకోపోతుందని ఎవరిని ఉపేక్షించమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Also Read: KTR on Congress: రేవంత్ రెడ్డిని కాపాడడం కుమ్మక్కు రాజకీయమే.. కేటీఆర్