True Hero: కూతురి కోసం.. ప్రాణాలకు తెగించిన తండ్రి!
True Hero (Image Source: Twitter)
Viral News, లేటెస్ట్ న్యూస్

True Hero: కూతురి కోసం.. ప్రాణాలకు తెగించిన తండ్రి.. ఎలాగో మీరే చూడండి!

True Hero: తండ్రి తన పిల్లలను ఎంతగా కాపాడుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొండంత కష్టం ఎదురైన బిడ్డల కోసం ధైర్యంగా ఎదుర్కొంటాడు. కుటుంబ పోషణ కోసం అహర్నిశలు శ్రమిస్తుంటాడు. అలాంటిది తన కళ్లముందే బిడ్డకు ఆపద వస్తే ఏ తండ్రైనా చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి. అమాంతం ఆపదను వెనక్కి నెట్టేసి బిడ్డను కాపాడుకుంటాడు. సరిగ్గా ఈ తరహా ఘటనే అమెరికాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని బహమాస్ నుంచి సముద్రం మార్గాన ఫ్లోరీడాకు డిస్నీ డ్రీమ్ అనే క్రూయిజ్ షిప్.. బయలు దేరింది. నడి సముద్రంలో షిప్ ప్రయాణిస్తుండగా ఐదేళ్ల పాప ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. ఇది గమనించిన తండ్రి ముందు వెనక ఆలోచించకుండా వెంటనే ఓడ నుంచి సముద్రంలోకి దూకాడు. మునిగిపోతున్న పాపను తన ప్రాణాలు అడ్డుపెట్టి రక్షించాడు. ఇది గమనించిన షిప్ లోని ప్రయాణికులు.. వెంటనే సిబ్బందిని అలర్ట్ చేశారు. అయితే అప్పటికీ షిప్ కొంత దూరం ప్రయాణించింది. రంగంలోకి దిగిన షిప్ లోని సహాయక సిబ్బంది.. చిన్న బోటు వేసుకొని తండ్రి, కూతుర్లు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఇద్దరినీ కాపాడి బోటులోకి ఎక్కించుకున్నారు. అయితే రెస్క్యూ టీమ్ వచ్చే వరకూ బిడ్డను మునిగిపోకుండా 20 నిమిషాల పాటు తండ్రి కాపాడినట్లు తెలుస్తోంది.

Also Read: Actress Pakeezah: కన్నీళ్లు పెట్టిన పాకీజా.. స్వేచ్ఛ ఎఫెక్ట్‌తో పవన్ కళ్యాణ్ స్పందన

నెటిజన్లు ప్రశంసలు..
నీటిలో ఉన్న తండ్రి కూతుర్లను రెస్క్యూ టీమ్ రక్షిస్తున్న దృశ్యాలను షిప్ లోని వ్యక్తి తన కెమెరాలో బంధించారు. అది కాస్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. తండ్రిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కూతుర్ని కాపాడుకున్న రియల్ హీరో అంటూ ఆకాశానికెత్తుకున్నారు. ప్రాణాలకు తెగించి బిడ్డను కాపాడుకోవడాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే వారిద్దరి ఆదృష్టం బాగుందన్న అభిప్రాయాలను కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే సమయంలో షార్క్ లేదా తిమింగళం వంటి ప్రమాదకర జీవులు నీటిలో ఉండి ఉంటే పెను ప్రమాదమే జరిగేదని అభిప్రాయపడుతున్నారు.

Also Read This: Samantha and Raj Nidimoru: సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. త్వరలోనే అఫీషియల్‌ ప్రకటన?

Just In

01

Telangana News: పలు జిల్లాల్లో స్కూల్ టైమింగ్స్ మార్పు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

RBI Governor: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ.. ఎందుకంటే?

Private Hospitals: కడుపుకోత.. గద్వాలలో డాక్టర్ల కాసుల కక్కుర్తి.. ఏం చేస్తున్నారంటే?

Champion Trailer: రోషన్ మేకా ‘ఛాంపియన్’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన శ్రీకాంత్ వారసుడు..

BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్