Doctors Day 2025: సమాజంలోని గొప్ప వృత్తుల్లో వైద్య వృత్తి ఒకటి. ఈ భూమి మీద ప్రాణం పోయగల లేదా నిలబెట్ట గల శక్తి ఒక్క వైద్యులకు మాత్రమే ఉంటుంది. అందుకే వైద్యులను చాలా మంది దేవుళ్లతో పోలుస్తుంటారు. వారు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. వైద్యాన్ని వృత్తిగా కాకుండా బాధ్యతగా భావిస్తూ ప్రజలకు సేవ చేస్తుంటారు. నిత్యం వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్న వైద్యులను గుర్తిస్తూ ప్రతి ఏటా జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇదిలా ఉంటే వైద్య విద్యకు సినీ పరిశ్రమకు అవినాభవ సంబంధం ఉంది. ఎంబీబీఎస్ (MBBS) చదివిన పలువురు నటీనటులు ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. నేషనల్ డాక్టర్స్ డే (National Doctors Day 2025) సందర్భంగా వారిపై ఓ లుక్కేద్దాం.
సాయి పల్లవి (Sai Pallavi)
టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయిన్స్ లో సాయిపల్లవి ఒకరు. ఆమె వైద్య విద్యను అభ్యసించారు. జార్జియాలోని త్బిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 2016లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. దేశంలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)చే గుర్తింపు పొందిన డిగ్రీ పట్టా కూడా అమె కలిగి ఉంది. ఫిదా (2017), లవ్ స్టోరీ (2021), శ్యామ్ సింగ రాయ్ (2021), విరాటపర్వం (2022) చిత్రాలతో నటిగా పాపులర్ అయ్యారు.
శ్రీలీల (Sreeleela)
యంగ్ హీరోయిన్ శ్రీలీల సైతం ఎంబీబీఎస్ చేశారు. శ్రీలల తల్లి స్వర్ణలత.. బెంగళూరులో గైనకాలజిస్ట్ కావడంతో.. ఆమె నుంచి స్ఫూర్తి పొందారు. 2023లో తన ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షలపై దృష్టి పెట్టడానికి శ్రీలీల సినిమా షూటింగ్‌ల కొంత విరామం తీసుకున్నారు. ఆ సమయంలో అనేక కీలక ప్రాజెక్ట్స్ ను కోల్పోవాల్సి వచ్చినట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar)
స్టార్ కపుల్ రాజశేఖర్, జీవిత కుమార్తె శివాని రాజశేఖర్ సైతం ఎంబీబీఎస్ చదివారు. హైదరాబాద్‌లోని అపోలో మెడికల్ కాలేజీలో ఆమె వైద్య విద్యను అభ్యసించారు. ఆమె ఫిబ్రవరి 2024లో తన ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అన్నయ్య (బాలనటిగా), 2 స్టేట్స్ (2020), WWW (2021) చిత్రాల్లో శివాని నటించింది.
రూప కొడువాయూర్ (Roopa Koduvayur)
యంగ్ హీరోయిన్ రూప కొడువాయూర్ సైతం ఎంబీబీఎస్ చేశారు. గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి హౌస్ సర్జన్ గా కొంతకాలం పనిచేశారు. ఆమె అంకాలజిస్ట్ కావాలనే లక్ష్యంతో వైద్య విద్యను ఎంచుకున్నారు. ఆమె తల్లి క్యాన్సర్ తో బాధపడటాన్ని ప్రత్యక్షంగా చూసిన రూప.. ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేశారు.
అదితి శంకర్ (Aditi Shankar)
తమిళ నటి అదితి శంకర్ సైతం ఎంబీబీఎస్ చదివారు. చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (Sri Ramachandra University) నుండి 2021లో పట్టా అందుకున్నారు. తమిళంలో విరుమన్, మావీరన్, తెలుగులో భైరవం చిత్రాల్లో ఆమె నటించారు.
అజ్మల్ అమీర్ (Ajmal Ameer)
నటుడు అజ్మల్ అమీర్.. ఉక్రెయిన్‌లోని నేషనల్ పిరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ డిగ్రీని పూర్తి చేశారు. అయితే వైద్య వృత్తిని కొనసాగించకుండా నటన రంగంలోకి ప్రవేశించారు. మలయాళం, తమిళం, తెలుగు ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు.
Also Read: Producer Sireesh: హీరోల కంటే అతనే బెటర్ అంటూ గేమ్ ఛేంజర్ నిర్మాత షాకింగ్ కామెంట్స్
అదితి గోవిట్రికర్ (Aditi Govitrikar)
తమ్ముడు సినిమాలో పవన్ సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించిన అదితి గోవిట్రికర్ సైతం డాక్టర్ విద్య చదివారు. ముంబైలోని గ్రాంట్ మెడికల్ కాలేజీ నుండి 1997లో ఎంబీబీఎస్ డిగ్రీ పొందారు. ఆమె ఒబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో ఎంఎస్ (MS) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా పూర్తి చేశారు.