Minister Seethakka: అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు..
Minister Seethakka( IMAGE Credit: swetcha reporter)
Telangana News

Minister Seethakka: అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు.. సొంత భవనాలకు నిధులివ్వండి!

Minister Seethakka: తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క (Seethakka) కేంద్రాన్ని కోరారు.  శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో (Nanna purnadevi) సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి, తెలంగాణలో అమలవుతున్న పథకాల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆరోగ్యలక్ష్మి, పోషణ్ 2.0, సంక్షేమ అంగన్‌వాడీ వంటి పథకాల ద్వారా తెలంగాణలో మహిళా, శిశు సంక్షేమానికి ప్రభుత్వం అధిక నిధులు వెచ్చిస్తోందని సీతక్క (Seethakka) కేంద్ర మంత్రికి వివరించారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అంగన్‌వాడీ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు కల్పిస్తున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

 Also Read: Minister Jupally Krishna Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై.. జూపల్లి కీలక వాఖ్యలు!

కేంద్ర వాటాను పెంచాలి..
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాల్లో కేంద్ర వాటాను పెంచాలని మంత్రి సీతక్క (Seethakka) కోరారు. అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు వరుసగా రూ.10,950, రూ.6,450 చెల్లిస్తుండగా, కేంద్రం తన వాటాగా నామమాత్రంగా కేవలం రూ.2,700, రూ.1,350 మాత్రమే చెల్లిస్తుందని, ఈ మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉందని సీతక్క (Seethakka) విజ్ఞప్తి చేశారు.

సొంత భవనాల నిర్మాణానికి నిధులు..
రాష్ట్రంలో 11 వేలకుపైగా అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, వాటికి సొంత భవనాల నిర్మాణానికి కేంద్ర నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు ప్రతిరోజూ 200ఎంఎల్ విజయ మిల్క్‌ను అందిస్తున్నామని, త్వరలో చిన్నారులకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దీనికి కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారం అందించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. మంత్రి సీతక్క వినతులకు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి (Nanna purnadevi) సానుకూలంగా స్పందించారు.

తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న పథకాలు అభినందనీయం అని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ మంత్రులు, అధికారులతో కలిసి తెలంగాణలో జాతీయ సదస్సు నిర్వహించి, ఇక్కడి బెస్ట్ ప్రాక్టీస్‌ను ఇతర రాష్ట్రాలకు పరిచయం చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అధిక నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మంత్రితో పాటు రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శి అంతా రామచంద్రన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 Also ReadPashamylaram Blast: పాశమైలారం ఘటన.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ!

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం