Banakacharla Project( IMAGE CREDIT: TWITTER)
ఆంధ్రప్రదేశ్

Banakacharla Project: బనకచర్లపై పార్టీల కుస్తీ.. క్రెడిట్ కోసం తాపత్రయం

Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా, పెన్నా బేసిన్‌లకు తరలించేందుకు చేపట్టిన గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు  కేంద్రం నిరాకరించింది. ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ 33వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రాథమిక రిపోర్టును పరిశీలించిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పలు అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. (Banakacharla Project) బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని అనేక అభ్యంతరాలు వచ్చాయని స్పష్టం చేసింది.

మొదటి నుంచి అభ్యంతరాలు

ఏపీ నిర్మిస్తున్న పోలవరం, (Banakacharla Project) బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ మొదటి నుంచి అభ్యంతరాలు తెలుపుతూ వస్తున్నది. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Banakacharla Project) బనకచర్ల ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగానే కేంద్రానికి డీపీఆర్‌ను సైతం అందజేస్తూ, మరోవైపు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీని కోరింది. బకనచర్లను అడ్డుకోవాలని, అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి ఒకవైపు లేఖలు, మరోవైపు కేంద్రమంత్రులను కలిసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వినతులు అందజేశారు. బకనచర్లను చేపడితే తెలంగాణను జరిగే నష్టాన్ని వివరించారు. ఈ క్రమంలో ప్రాజెక్టుపై అభ్యంతరాలు ఉన్నాయని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పేర్కొంటూ, ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

 Also Read: Minister Sridhar Babu: మీ సేవలో కొత్తగా వివాహ రిజిస్ట్రేషన్!

పర్యావరణ నిపుణుల కమిటీ సైతం..

పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. భారీగా అభ్యంతరాలున్నాయని పేర్కొంది. అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్‌ డిస్ప్యూట్‌ ట్రైబ్యనుల్‌ తీర్పును పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. పర్యావరణ అనుమతుల కోసం సీడబ్ల్యూసీని సంప్రదించడం అత్యవసరమని పేర్కొంది. బనకచర్ల ప్రాజెక్టును (Banakacharla Project) ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పరిశీలించిన కమిటీ, 1983లో గోదావరి ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది.

నీటి నిల్వపై కేంద్రంతో అధ్యయనం, ఏపీ, తెలంగాణలకు సంబంధించిన అంశాలకు అన్ని అనుమతులు, పర్యావరణ ప్రభావంపై అంచనా వేసిన తర్వాతే ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు జారీ చేయడం సాధ్యమవుతుందని కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు అనుమతుల కావాలంటే సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ సమీక్ష తప్పనిసరి అని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ జీడబ్ల్యూడీటీ తీర్పు ఉల్లంఘించినట్లవుతుందని ఫిర్యాదులు వచ్చాయని వాటన్నింటినీ పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది.

ప్రాజెక్ట్ నివేదికలో లోపాలున్నాయని, నీటి పంపకాల్లో జీడబ్ల్యూడీటీ తీర్పును ఉల్లంఘించేలా ఉన్నదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు మొదట డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించాలని, వారిచ్చే సూచనల ఆధారంగానే నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. బనకచర్ల ప్రాజెక్టులో నీటి నిల్వపై కేంద్రంతో అధ్యయనం, రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు అన్ని అనుమతులు, పర్యావరణ ప్రభావంపై అంచనా వేసినా తర్వాతే ప్రాజెక్టుకు పూర్తి స్థాయి అనుమతివ్వడానికి సాధ్యమవుతుందని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.

ఈఏసీ ఈ ప్రాజెక్టును గోదావరి బేసిన్ నుంచి (పోలవరం ఆనకట్ట) వరద నీటిని రాష్ట్రంలోని నీటి కొతర ఉన్న బేసిన్‌లకు మళ్లించే పథకంగా గుర్తించింది. అయితే, ఏపీ నిర్మించిన పోలవరం ప్రాజెక్టుకు 25 జనవరి 2005న మంత్రిత్వశాఖ ఆమోదం ఇచ్చింది. అయినప్పటికీ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ముంపు ఉండడంతో వివాదం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ ప్రతిపాదకుడు(పీపీ) కేంద్ర జల కమిషన్(సీడబ్ల్యూసీ)తో సహా వరద నీటిని అందుబాటు గురించి సమగ్రంగా అధ్యయనం చేయాలని సిఫార్సు చేసింది. గోదావరి జల విభాగం ట్రైబ్యునల్ ఆర్డర్లను పరిగణనలోకి తీసుకొని ఇతర రాష్ట్రాల మధ్య సమస్యలను పరిశీలించి అవసరమైన అనుమతులను పొందాలని సూచించింది. మొత్తంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం తొలి విజయంగా దీనిని చెప్పొచ్చు.

 Also Read: Bandi Sanjay: బీసీకి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా?.. బండి సంజయ్ కీలక వాఖ్యలు!

సీఎం భేటీలు

ఈ నెల 19న ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతోపాటు ఇతర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి, (Revanth Reddy) ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి, బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project) ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్‌ 1980 (జీడబ్ల్యూడీటీ), ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014కు విరుద్ధంగా ఏపీ సర్కారు వ్యవహరిస్తున్నదని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక, పర్యావరణ శాఖలు వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయని చెప్పారు.

గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టును (Banakacharla Project) ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతున్నదని, కానీ, జీడబ్ల్యూడీటీ 1980లో వరద, మిగులు జలాల ప్రస్తావనే లేదని వివరించారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా ప్రాజెక్టును కట్టాలనుకుంటే తొలుత ఆ నదీ యాజమాన్య బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించి అనుమతి పొందాలని, కానీ, ఏపీ వీటన్నింటినీ ఉల్లంఘిస్తున్నదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏ నిబంధనలూ పాటించకుండా వరద జలాల ఆధారంగా ప్రాజెక్ట్ చేపడుతున్నామని చెప్పడం తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, జల్‌శక్తి శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1,500 టీఎంసీల వినియోగానికి తెలంగాణకు కేంద్ర జల్‌శక్తి శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతేగాకుండా ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు బకనచర్లపై కేంద్రానికి లేఖలు కూడా రాశారు.

నా ఒత్తిడే కారణం

కనకచర్ల ప్రాజెక్టుకు పర్యవరణ అనుమతులను పర్యావరణ నిపుణుల కమిటీ(ఈఏసీ) నిరాకరించడానికి తన ఒత్తిడే కారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తొలి దెబ్బ కొట్టామన్నారు. కేంద్రంపై తమ ఒత్తిడి, ప్రయత్నాలు ఫలించాయని చెప్పారు. గోదావరిలో వరద జలాలను సమగ్రంగా లెక్కించాలన్నారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్ గోదావరి నది జలాల అవార్డుకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. తెలంగాణకు బనకచర్లతో తీవ్ర నష్టం జరుగుతున్నదని వెల్లడించారు. అందుకే ప్రాజెక్టును అడ్డుకుంటున్నామని వెల్లడించారు.

బీఆర్ఎస్ విజయం

కేంద్ర జల వనరుల కమిషన్ (సీడబ్ల్యూసీ), గోదావరి వాటర్ జల సమస్య ట్రైబ్యునల్(జీడబ్ల్యూడీటీ) పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పోరాట విజయమని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రజల విజయం. బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.

 Also Read: Aamir Khan: ఆ ముగ్గురు టాప్ హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు.. తట్టుకోలేకపోతున్నా.. అమీర్ ఆవేదన!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..