Raja Singh resigned (imagecredit:twitter)
Politics

Raja Singh resigned: రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం.. పలువురు నేతల ప్రశ్నలు

Raja Singh resigned: బీజేపీ(BJP) కమల దళపతి నియామకంపై రచ్చ మొదలైంది. ఎలక్షన్ అని చెప్పి నామినేషన్లు వేయనివ్వడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) బహిరంగంగానే ఘాటు విమర్శలు చేసి పార్టీకి రాజీనామా చేశారు. కాగా ఇంకొందరు నేతలు కూడా బహిరంగంగా వెల్లడించకపోయినా అదే నిజమని చర్చించుకుంటున్నారు. ఇది ఎన్నిక కాదని, కేవలం ఎంపిక మాత్రమేనని చెబుతున్నారు. నామ్ కే వాస్తే ఎలక్షన్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. అలాంటప్పుడు ఎన్నిక అని చెప్పడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. నేరుగా స్టేట్ చీఫ్ ఎవరనేది ప్రకటిస్తే బాగుండేది కదా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఈ అంశంపై కొందరు పార్టీ నేతుల సైతం స్పందించారు. ఇది తమ పార్టీ ఇంటర్నల్ ఎలక్షన్ అంటూ పేర్కొన్నారు.

నామినేషన్‌కు తనను వేయనివ్వకుండా

ఎన్నిక అంటే ప్రజాస్వామ్యయుతంగా తమకు నచ్చిన నేతను ఎన్నుకునే ప్రక్రియ. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దానికితోడు ప్రపంచంలోనే అత్యధికంగా సభ్యత్వాలు కలిగిన పార్టీలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగకపోవడం అప్రజాస్వామికమే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు హైకమాండ్ పార్టీ పలు నిబంధనలు పెట్టింది. పదేండ్ల నుంచి ప్రాథమిక సభ్యత్వంతో పాటు మూడు క్రియాశీల సభ్యత్వాలు, పదిమంది స్టేట్ కౌన్సిల్ మెంబర్ల బలపరచాలని నిబంధన ఉంది.

అలాంటివారికే అవకాశం కల్పించాలని షరతు విధించింది. కాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్ కు వెళ్లగా తనను వేయనివ్వకుండా అడ్డుకున్నారని, తనను బలపరిచేందుకు వచ్చిన వారిని సస్పెండ్ చేస్తానని బెదిరించారని విమర్శలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు తనను డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ కు లేఖ రాయాలని కిషన్ రెడ్డికి(kishan Reddy) లేఖ రాయడం గమనార్హం.

Also Read: Anchor Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నమ్మలేని నిజాలు

రాజీనామా చేయడం పార్టీకి కొంత నష్టమే

రాజాసింగ్ రాజీనామాతో పాటు ఆయన చేసిన ఆరోపణలపై బీజేపీ(BJP) రాష్ట్ర నాయకత్వం సైతం అంతేస్థాయిలో ఘాటుగా స్పందించింది. ఆయన పోతే పోనీలే అని రాజాసింగ్ ను లైట్ తీసుకుంది. కనీసం బుజ్జగింపు చర్యలు కూడా పార్టీ తీసుకోలేదు. ఆయన వెళ్లిపోతేనే బెటర్ అనే ధోరణిలో రాష్ట్ర నాయకత్వం ఉంది. రాజాసింగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని మండిపడింది. రాజసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ కు లేఖ ఇవ్వాలని స్పష్టమైన వైఖరిని పార్టీ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది.

తమకు వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమని స్పష్టంచేసింది. రాజాసింగ్ ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నట్లు రాష్ట్ర నాయకత్వం స్పష్టంచేసింది. గ్రేటర్ పరిధిలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. అలాంటిది ఆయన పార్టీకి రాజీనామా చేయడం పార్టీకి కొంత నష్టమే అయినా ఆయన కొద్దిరోజులుగా సొంత పార్టీపై చేస్తున్న విమర్శలు డ్యామేజ్ చేసేలా ఉండటంతో రాష్ట్ర నాయకత్వం కూడా ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. అయితే కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరొందిన రాజాసింగ్ పార్టీకి దూరమవ్వడం లాభమా? నష్టమా? అనేది భవిష్​యత్ లో చూడాలి.

Also Read: MP Raghunandan Rao: రఘునందన్ రావుకు మళ్ళీ మావోయిస్టుల బెదిరింపుకాల్స్

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?