KTR on Congress: అవినీతి, అక్రమాలు, స్కాంలలో కూరుకుపోయి తెలంగాణ(Telangana) సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన కాంగ్రెస్(Congress)ను బీజేపీ(BJP)నే కాపాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ(Delhi) కాంగ్రెస్ కి ఏటీఎంగా మారిందని నిన్న గొంతుచించుకున్న అమిత్ షా(Amit Sha), కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, తానే హోంమంత్రి అన్న సంగతిని మరిచిపోయిన నయా గజిని అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బరితెగించి చేస్తున్న అవినీతి విషయంలో బీజేపీ అగ్రనేతలంతా తేలు కుట్టిన దొంగల్లా మారిపోయారని, 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఎక్స్ వేదికగా మండిపడ్డారు. బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుండి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం “రాహుల్-రేవంత్ పన్ను” వసూలు చేస్తోందని సాక్షాత్తూ ప్రధాని మోడీ ఆరోపిస్తే, కేంద్రంలోని ఏ ఒక్క దర్యాప్తు సంస్థ విచారణ జరపకపోవడం ఆ రెండు పార్టీల అక్రమ సంబంధానికి అద్భుత నిదర్శనమన్నారు.
కంచె గచ్చిబౌలి అటవీ భూముల అమ్మకం
తన బావమరిది సృజన్ రెడ్డికి ₹1,137 కోట్ల విలువైన అమృత్ పనుల కాంట్రాక్టును ఎలాంటి నిబంధనలు పాటించకుండా రేవంత్ రెడ్డి కట్టబెడితే కేంద్ర ప్రభుత్వం కనీస విచారణ జరపలేదని ఆరోపించారు. అన్ని సాక్ష్యాలతో తాము కేంద్రమంత్రిని కలిసి ఫిర్యాదుచేసినా మోడీ(Modhi) ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కంచె గచ్చిబౌలి(Kancha Gachibowli) అటవీ భూముల అక్రమ అమ్మకం వ్యవహారంలో అన్ని రకాల నియమ నిబంధనలను రేవంత్ (CM Revanth Reddy)రెడ్డి తుంగలో తొక్కినా కూడా కేంద్రం కళ్లు, చెవులు, నోరు మూసుకుందని మండిపడ్డారు. ఇదో బడా స్కాం అని, ₹10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగిందని సమగ్ర దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ(CEC) సిఫార్సు చేసినా మోడీ ప్రభుత్వం కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Min Ponguleti Srinivass Reddy) కంపెనీకి ₹4,400 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టును ఇవ్వడంలో జరిగిన అవినీతి బహిరంగంగా కనిపిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు.
Also Read: Kethireddy: కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు కూల్చేస్తారా.. సీన్ రివర్స్!
తెలంగాణ సంపద.. ఢిల్లీకి మూటలు
పొంగులేటి ఇంట్లో జరిగిన ఈడీ దాడులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు ప్రకటన ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్(National Herald Case) కేసు ఛార్జ్ షీట్ లో సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉన్నప్పటికీ ఆయనను విచారించకపోవడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న బలమైన అనుబంధానికి నిదర్శనమన్నారు. నిన్నటి కర్ణాటక వాల్మీకి కుంభకోణంలో ఓ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడి బ్యాంకు ఖాతాల్లోకి ₹45 కోట్ల నగదు బదిలీ అయిందన్న ఆధారాలు ఉన్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
తెలంగాణ సంపదను లూటీ చేస్తూ ఢిల్లీకి మూటలు పంపుతున్న కాంగ్రెస్ సీఎం అక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదో చెప్పాలని నిలదీశారు. ఢిల్లీలో కాంగ్రెస్ తో కుస్తీ చేస్తున్న తెలంగాణలో మాత్రం దోస్తీ చేస్తూ రేవంత్ రెడ్డిని బీజీపీ(BJP) పెద్దలు వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. అయితే బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) చేస్తున్న ఈ అవకాశవాద, అనైతిక రాజకీయాలు ప్రజలకు అర్థం అయ్యాయన్నారు. సరైన సమయంలో తగిన విధంగా ఈ రెండు పార్టీలకు కర్రు కల్చి వాత పెడతారని హెచ్చరించారు.
Also Read: Kishan Reddy: ప్రజల కోసమే పనిచేస్తాం.. రేవంత్ రెడ్డి కోసం కాదు!