Child Trafficking (imagcredit:twitter)
తెలంగాణ

Child Trafficking: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత

Child Trafficking: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత అని రాచకొండ కమిషనర్​సుధీర్ బాబు(CP Sudeer Babu) అన్నారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులోని పిల్లల బాల్యాన్ని పాడు చేసే హక్కు ఎవ్వరికీ లేదని చెప్పారు. చైల్డ్ ట్రాఫికింగ్(Child trafficking) గ్యాంగుల భరతం పట్టటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేటి నుంచి ఆపరేషన్​ముస్కాన్(Operation Muskan)​–11 ప్రారంభం కానున్న నేపథ్యంలో నేరెడ్ మెట్ లోని తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ వేలాది మంది పిల్లల బాల్యాన్ని చిదిమి వేస్తోందన్నారు.

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించటం

తల్లిదండ్రుల పేదరికం, బెగ్గింగ్ మాఫియా(Begging Mafia) చేతుల్లో చిక్కుకుంటూ చిన్నారులు బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. ఇలాంటి పిల్లలు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో చిక్కుకుని నేరస్తులుగా మారే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. కాసిన్ని పైసల కోసం తల్లిదండ్రులు తమ తమ పిల్లలను కార్మికులుగా మార్చవద్దని సూచించారు. పిల్లలు చదువుకోవటానికి ప్రభుత్వం పలు ఉచిత సంక్షేమ పథకాలను అందిస్తోందని చెప్పారు. వీటిని సద్వినియోగం చూసుకోవాలన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించటం ప్రజలు కూడా నైతిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఇక, రాచకొండ కమిషనరేట్ పరిధిలో చైల్డ్ ట్రాఫికింగ్(Child trafficking)కు పూర్తి స్థాయిలో చెక్​పెట్టటానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

Also Read: KTR: హోం మంత్రి అమిత్ షాకు కేటీఆర్ సూటి ప్రశ్నలు.. బదులిచ్చేదెవరు?

వర్క్ సైట్ పాఠశాలలను ఏర్పాటు

దీని కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు. పట్టుబడుతున్న చైల్డ్ ట్రాఫికర్లపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఇక, బీహార్(Bihar), ఒడిషా(Odisha) తదితర రాష్ట్రాల నుంచి ఉపాధిని వెతుక్కుంటూ వలస వచ్చిన వారి కుటుంబాలు పని చేస్తున్న ప్రాంతాల్లో వర్క్ సైట్ పాఠశాలలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీని వల్ల వారి పిల్లలు చదువుకునే వీలు కలిగిందని చెప్పారు. సమావేశంలో మహిళా భద్రత డీసీపీ ఉష(DCP Usha), సీడబ్ల్యుసీ చైర్ పర్సన్లు నరేందర్ రెడ్డి, రాజారెడ్డి, జయశ్రీ, శ్యాంప్రసాద్​ తోపాటు వేర్వేరు విభాగాలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ బాబు ఆపరేషన్​ ముస్కాన్​–11 పోస్టర్‌ను విడుదల చేశారు.

Also Read: Snigdha: గుడ్ న్యూస్ చెప్పిన మిరపకాయ్ క్యూట్ గర్ల్.. వీడియో వైరల్

 

 

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు