Kareena Kapoor: ఈ ఏడాది జనవరి 16న ముంబైలోని బాంద్రాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లోనే కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే దుండగుడు దొంగతనానికి వచ్చి, ప్రతిఘటించిన సైఫ్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెన్నెముకకు గుచ్చుకొని విరిగిపోయిన 2.5 అంగులాల కత్తి ముక్కను సుమారుగా ఐదున్నర గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి వైద్యులు తొలగించారు. దీంతో, ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఈ షాకింగ్ ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత సైఫ్ బార్య, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor) తొలిసారి స్పందించారు. తన కొడుకులు తైమూర్, జెహ్ ఇద్దరూ ఉండే గదిలోకి ఎవరో ఒక దుండగుడు ప్రవేశించి దాడికి పాల్పడడం తనను ఇప్పటికీ భావోద్వేగానికి గురిచేస్తోందని, ఆ ఆలోచనలతో ఇంకా పోరాడుతూనే ఉన్నానని ఆమె విచారించారు.
Read this- Kolkata Case: లా విద్యార్థిని కేసు.. మనోజిత్ పెద్ద గలీజ్ గాడు.. వాడి చరిత్ర ఇదిగో
మల్టీమీడియా, ఈవెంట్ కంపెనీ ‘మోజో స్టోరీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బర్ఖా దత్ అడిగిన పలు ప్రశ్నలకు కరీనాకపూర్ సమాధానం ఇచ్చారు. ఈ తరహా దాడులు ముంబైలో జరగడం చాలా అరుదని, అమెరికాలో ఎక్కువగా జరుగుతుంటాయని ఆమె చెప్పారు. సైఫ్‌పై దాడి ఘటన నుంచి తాను ఇంకా పూర్తిగా బయటపడలేదని చెప్పారు. ముఖ్యంగా మొదటి రెండు నెలలైతే తాను చాలా ఆందోళన చెందేదానినని అన్నారు. నిద్ర పట్టేది కాదని, తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి చాలా ఇబ్బందిపడ్డానని ఆమె వెల్లడించారు. కాలం గడిచేకొద్దీ ఆ చేదు జ్ఞాపకాలు క్రమంగా మరుగునపడుతున్నట్టు తాను గ్రహించానని అన్నారు. ‘‘ ఆ బాధ మనసులో ఉంటుంది. మరణం లాంటిదనే చెప్పాలి. జీవితంలో ఎవరినైనా కోల్పోతే తిరిగి ఎప్పటికీ పొందలేం కదా. నేను ఇది ఎల్లప్పుడూ నమ్ముతాను. ఆ బాధను ఎప్పటికీ అధిగమించలేం. పిల్లల కోసం బతుకుతూ భయంతో జీవించాలనుకోవడం లేదు. ఎందుకంటే, ఆ ఒత్తిడి పిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది’’ అని కరీనా కపూర్ పేర్కొన్నారు.
Read this-Viral News: చెత్త ట్రక్‌లో మహిళ డెడ్‌బాడీ.. దర్యాప్తు చేస్తే..
ఒక అమ్మగా, భార్యగా తన పాత్రలను బ్యాలెన్స్ చేసుకుంటూ భయం, ఒత్తిడిని అధిగమించడం చాలా సంక్లిష్టమని కరీనా కపూర్ చెప్పారు. పరిస్థితులను అర్థం చేసుకోని మెలగడానికి భావోద్వేగంతో కూడిన అవగాహన చాలా అవసరమైందని ఆమె వివరించారు. ఇంట్లో అందరూ సురక్షితంగా ఉండడంతో దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు.
సైఫ్ ఒక ‘బాట్‌మ్యాన్’ అని, ‘ఐరన్ మ్యాన్’ అని 4 ఏళ్ల తన కొడుకు జెహ్ భావిస్తున్నాడని ఆమె వివరించారు. తండ్రిని ఇంత పెద్ద బాధాకరమైన పరిస్థితిని చూసినవారిద్దరూ ప్రత్యేక ఆత్మవిశ్వాసం, ధైర్యంతో పెరుగుతాయని కరీనాకపూర్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘పిల్లలిద్దరూ రక్తం, కత్తీ అన్నీ చూశారు. ఈ గాయం తైమూర్, జెలను చాలా భిన్నమైన వ్యక్తులుగా మార్చుతుంది. చూసి ఉండకూడదు. కానీ, అనుకోకుండానే ఆ సడన్‌గా ఘటనను చూశారు. ఆ ఘటన నుంచి వారు బయటపడతారని నేను భావిస్తున్నాను’’ అని వివరించారు. తన వ్యక్తిగత బాధ పిల్లల మీదకు మల్లకుండా ఒక తల్లిగా చేయాల్సిన ప్రయత్నం చేస్తానని ఆమె వివరించారు. అయితే, ఒక వ్యక్తిగా మాత్రం దాడి ఘటన తనను కల్లోలానికి గురిచేసిందని, తనను కదిలించిందని అన్నారు. పిల్లలు ఎప్పుడూ అదే భయంలో బతకకూడదని సైఫ్ తరచూ చెబుతుంటారని కరీనా గర్తుచేశారు.