Raja Singh: సీనియర్ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి (BJP) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా (Resign) లేఖను అధిష్టానానికి పంపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సంచలన వాఖ్యలు చేశారు. ‘ నాకు ముగ్గురు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంతకం చేశారు. నామినేషన్ వేయడానికి వస్తే వేయనివ్వలేదు. కౌన్సిల్ మెంబెర్స్‌ను ఫోన్ చేసి బయపెట్టించారు. పార్టీకి రాజీనామా లేఖను ఇచ్చాను. స్పీకర్‌కు సమాచారం ఇవ్వాలని కిషన్ రెడ్డికి చెప్పాను. పార్టీ కోసం సర్వం ధార పోశాను. టెర్రరిస్టులకు టార్గెట్‌గా ఉన్నాను. మీకో దండం, మీ పార్టీకో దండం. బీజేపీకి లవ్ లెటర్ ఇచ్చి మరీ వెళ్తున్నాను. నన్ను అధ్యక్షుడిగా నియమిస్తే యోగి ఆదిత్యనాథ్‌లాగా పనిచేస్తాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నా. నన్ను అధ్యక్షుడిగా చూడాలని చాలా మంది కార్యకర్తలు కోరుకుంటున్నారు. నన్ను అధ్యక్షుడిని చేస్తే గోరక్షణ విభాగం ఏర్పాటు చేసి, గోరక్షకులకు అండగా నిలుస్తాను. బీజేపీ హిందుత్వ పార్టీ అని, యోగి ఆదిత్యనాథ్ లాగా పనిచేస్తామని గడపగడపకు తిరిగి ప్రచారం చేస్తాను’ అని రాజాసింగ్ ప్రకటించారు.
Read Also- AN63: రణబీర్ కపూర్‌కు ‘యానిమల్’.. మరి అల్లరి నరేష్‌కు?
రాజీనామా వెనుక..?
రాజాసింగ్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావును నియమించడమే. ఈ నియామకం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవానికి ఇన్నిరోజులు తాను పార్టీని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నానని.. వదిలేస్తున్నట్లు ఎంతసేపూ ప్రకటించారే తప్ప తొలిసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆలోచనలో పడ్డారు. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని లేనిచో బండి సంజయ్‌ను ప్రకటించాలని గతంలోనే ప్రకటించారు. అయితే అదేదీ జరగకపోగా.. బండిని కేంద్ర పదవుల్లోకి తీసుకోవడంతో చేసేదేమీలేక రాజాసింగ్ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఎవరో ఊరూ, పేరు లేని వ్యక్తిని నియమించారన్నది ఆయన భావన. రాంచందర్ నేతృత్వంలో పార్టీ బతికి బట్టకట్టే ప్రసక్తే లేదని తన అనుచరులు, అభిమానుల ముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. రెండ్రోజులకో వివాదం, మూడ్రోజులకో రచ్చతో వార్తల్లో నిలవడం రాజాసింగ్‌కు కొత్తేమీ కాదు. ఆయన బీజేపీ ఆఫీసుకు రావడం చాలా అరుదు. చాలా రోజుల తర్వాత కార్యాలయానికి వచ్చిన రాజా.. సడన్‌గా ఇలా నిర్ణయం తీసుకున్నారు.
Read Also- Tadipatri: తాడిపత్రిలో అసలేం జరుగుతోంది.. ఏడాది కాలంగా ఎందుకిలా?
ఎంతచేసినా.. ఏం ఫలితం?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై సోమవారం ఉదయం నుంచే హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే రాజాసింగ్ స్పందిస్తూ.. ఓ వ్యక్తిని అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని అసహనంతో మాట్లాడారు. అయితే అధ్యక్షుడ్ని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకూ ఓటేసి ఎన్నుకోవాలని అధిష్టానానికి సలహా ఇచ్చారు. ‘ మావాడు, నీవాడు అంటూ నియమించుకుంటూ వెళ్తే పార్టీకే నష్టం కలుగుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అధ్యక్షుడి కోసం ఎన్నిక జరగాల్సిందే. నా వరకూ నేను పార్టీ కోసం సర్వం ధారపోశాను. నేను, నా కుటుంబం టెర్రరిస్టులకు టార్గెట్‌గా ఉన్నాను. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంతో పోరాడాం. అయితే పార్టీ అధికారంలోకి రాకుండా ఉండటానికి బీజేపీలో నాయకులే అడ్డుపడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఎవరికి ఇవ్వాలో ముందే డిసైడ్ చేశారు. పార్టీ సింబల్ మీద గెలిచాను. పార్టీ కోసం ఎంతచేసినా ఏం లాభం..? అందుకే ఇక పార్టీలో ఉండకూడదని నిర్ణయించా. రాజీనామా లేఖను కిషన్‌రెడ్డికి అందించాను. స్పీకర్‌కు కూడా రాజీనామా లేఖను కిషన్‌రెడ్డే పంపించాలి’ అని రాజాసింగ్ తేల్చిచెప్పారు. రాజీనామా చేసిన తర్వాత కూడా తానేమీ సైలెంట్‌గా ఉండనని.. హిందుత్వ కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు, అధ్యక్షుడి నియామకం రాజకీయంగా తీవ్ర చర్చకు తావిచ్చాయి. రాజీనామా వ్యవహారంపై రాష్ట్ర, కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
Read Also- Ice cream: ఐస్ క్రీమ్ ఎక్కువ తింటారా.. ఈ న్యూస్ మీ కోసమే!
రాజాసింగ్ రాజీనామా లేఖ కోసం ఈ ట్వీట్ క్లిక్ చేయండి..
The silence of many should not be mistaken for agreement.
I speak not just for myself, but for countless karyakartas and voters who stood with us with faith, and who today feel let down.
Jai Shri Ram 🚩 pic.twitter.com/JZVZppknl2
— Raja Singh (@TigerRajaSingh) June 30, 2025