Indonesia: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన.. యావత్ భారతావనిని తీవ్ర ఆవేదనకు గురిచేసిన సంగతి తెలిసిందే. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలి 270 మందికి పైగా ప్రాణాలు విడిచారు. మృతదేహాలు తీవ్రంగా కాలిపోవడంతో డీఎన్ఏ ఆధారంగా వాటిని గుర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఈ తరహా ఘటన ఎక్కడ జరగకూడదని సగటు భారతీయుడు భగవంతుడ్ని ప్రార్థించారు. ఇదిలాఉంటే తాజాగా ఇండోనేషియాలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఇండోనేషియాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టాంగెరాంగ్ ప్రావిన్స్‌లోని సోకర్నో-హట్టా అంతర్జాతీయ విమానశ్రయం (Soekarno-Hatta International Airport)లో కొద్దిలో ఓ విమానం.. పెను ప్రమాదం నుంచి బయటపడింది. తుపాను కారణంగా బలమైన గాలులు వీస్తున్న క్రమంలో విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఈదురుగాలులు గట్టిగా వీయడంతో ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. దీంతో విమానాన్ని రన్ వే (Run Way)పై ల్యాండ్ చేస్తున్న క్రమంలో పైలెట్లు నియంత్రణ కోల్పోయారు. అయితే వెంటనే సమర్థవంతంగా విమానాన్ని కంట్రోల్ లోకి తెచ్చుకోవడంతో పెను ప్రభావం తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
తీవ్ర తుఫాను.. విమానానికి తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం!
ఇండోనేషియాలోని సోకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన. బలమైన గాలులు మరియు వర్షం కారణంగా రన్‌వేపైకి దూసుకెళ్లిన బాటిక్ ఎయిర్ విమానం. ల్యాండింగ్ సమయంలో కాసేపు నియంత్రణ కోల్పోయిన పైలట్లు.. సకాలంలో పైలట్లు అప్రమత్తమై… pic.twitter.com/hA5y9uFwnD
— ChotaNews App (@ChotaNewsApp) June 30, 2025
Also Read: Telangana BJP president: బీజేపీ అధ్యక్ష రేసు నుంచి ఔట్.. ధర్మపురి అర్వింద్, రాజాసింగ్ రియాక్షన్ ఇదే!
విమానం సేఫ్ గా ఆగిన వెంటనే విమానాశ్రయ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఫ్లైట్ లోని ప్రయాణికులను అత్యవసరంగా దించేశారు. అనంతరం విమానాన్ని ఇంజనీర్ల బృందం తనిఖీ చేసింది. ఇంజిన్ లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, విమానానికి నష్టం కూడా జరగలేదని పేర్కొన్నారు. మరోవైపు విమానం వీడియోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. కొద్దిలో పెను ప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకుంటున్నారు. పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని ప్రశంసిస్తున్నారు.