secretariate employee rahul
క్రైమ్

Rahul: సచివాలయ ఉద్యోగి అనుమానాస్పద మృతి

Retd IAS: సచివాలయ ఉద్యోగి రాహుల్ అనుమానాస్పదంగా మృతి చెందారు. సెక్రెటేరియట్‌లో రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుమిదిని పేషీలో 11 ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా రాహుల్ పని చేశారు. రాహుల్‌ను రాణి కుమిదిని సీరియస్‌గా మందిలించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆపరేషన్ జరిగిన తర్వాత కొన్ని గంటలకు ఆయన మరణించారు. ఈ ఉదంతంపై సెక్రెటేరియట్ ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని సచివాలయ ఉద్యోగులంతా సీఎస్ శాంతి కుమారిని కలిసి విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుమిదిని పేషీలో రాహుల్ పని చేస్తున్నారు. మే 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఉన్నపళంగా కుప్పకూలారు. ఇది గుర్తించిన తోటి ఉద్యోగులు వెంటనే ఆయనను అంబులెన్స్‌కు ఫోన్ చేసి సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు తరలించారు. ఆర్థిక కారణాల రీత్యా అనంతరం ఆయనను నిమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. నిమ్స్ హాస్పిటల్‌లో రాహుల్‌కు హార్ట్ సర్జరీ చేశారు. డయాలసిస్ కూడా చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే, 48 గంటలపాటు అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఇంతలోనే నిన్న రాత్రి 9 గంటలకు రాహుల్ తుదిశ్వాస విడిచారు.

Also Read: వివేకా హత్య కేసులో భారతి రెడ్డి పాత్ర? బిగ్ టీవీతో వైఎస్ షర్మిల ఇంటర్వ్యూ

రాహుల్‌ను రాణి కుమిదిని సీరియస్‌గా మందలించారని, ఈ నేపథ్యంలోనే రాహుల్ కుప్పకూలిపోయాడని తోటి ఉద్యోగులు అనుమానిస్తున్నారు.

Just In

01

Cyclone Montha: రాష్ట్రంలో వర్ష బీభత్సం.. డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారి.. ప్రేక్షకులను భలే బురిడీ కొట్టిస్తున్నారుగా?

Seethakka: మైనార్టీలను మోసం చేసింది బీఆర్‌ఎస్‌.. మంత్రి సీతక్క కౌంటర్!

Bigg Boss Telugu 9 Re Enter: బిగ్ బాస్‌లో సంచలనం.. పర్మినెంట్ హౌస్‌మేట్‌గా భరణి? మరి శ్రీజ పరిస్థితేంటి?

Bhatti Vikramarka: జీసీసీలకు క్యాపిటల్ హైదరాబాద్.. సమానత్వంతో కూడిన వృద్ధి లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క