Anchor Swetcha: న్యూస్ ప్రెజెంటర్ స్వేచ్ఛ వొటార్కర్ (Swetcha Votarkar) ఆత్మహత్య కేసులో మరో సంచలన విషయం వెలుగుచూసింది. నిన్న రాత్రి చిక్కడపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయిన పూర్ణ చందర్ నాయక్‌ను (Purna Chander Naik) ఆదివారం సాయంత్రం జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో పూర్ణ చందర్‌కు 14 రోజుల పాటు జడ్జి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పూర్ణను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఇక్కడ సంచలన విషయమం ఏమిటంటే.. పూర్ణ చందర్ తన కన్ఫషన్ స్టేట్మెంట్‌లో నివ్వెరపోయే విషయాలు బయటపెట్టాడు. ఈ స్టేట్మెంట్‌లో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు (Joginapalli Santosh Rao) పేరు బయటపెట్టాడు. తనకు సంబందించిన అన్ని విషయాలు సంతోష్ రావుకు తెలుసని పూర్ణ చెప్పడం గమనార్హం. ఆయన్ను అడ్డుపెట్టుకొనే ఇంత కథ నడిపించాడని దీన్ని బట్టి క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవచ్చు.
Read Also- Anchor Swetcha: స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నమ్మలేని నిజాలు
అవును.. చేసుకోను!
‘ నన్నేం చేయలేవు’ అంటూ స్వేచ్ఛను గట్టిగా బెదిరించినట్లుగా తేలింది. అంతేకాదు.. భర్తతో విడాకులు తీసుకోమని చెప్పిన పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. అయితే.. పూర్ణ మాటలు నమ్మి భర్తకు విడాకులు ఇచ్చింది స్వేచ్ఛ. విడాకుల తర్వాత పలుమార్లు పెళ్లి చేసుకోవాలని పూర్ణను స్వేచ్ఛ నిలదీసింది. అయితే, పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ పూర్ణ దాట వేస్తూ వచ్చినట్లుగా రిమాండ్ రిపోర్టులో ఉన్నది. వారం రోజుల క్రితం అరుణాచలం వెళ్లి మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు స్వేచ్ఛ, పూర్ణ చందర్ తిరిగొచ్చారు. అరుణాచలం నుంచి తిరిగి వస్తున్న సమయంలోనే మరోసారి పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అయితే చివరికి పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది స్వేచ్ఛ. అంతేకాదు.. ‘ నన్నేం చేయలేవు.. నాకు రాజకీయ అండ దండలు ఉన్నాయి’ అని పూర్ణ చందర్ బెదిరించాడు. ఇదిలా ఉంటే.. అటు విచారణలో, ఇటు రిమాండ్ రిపోర్టులో స్వేచ్ఛతో రిలేషన్‌లో ఉన్న విషయం సంతోష్ రావుకు తెలుసని పదే పదే పూర్ణ చందర్ చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు..? తదుపరి విచారణ ఎలా ఉండబోతోంది..? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
Read Also- Swetcha: యాంకర్ స్వేచ్ఛ చివరిసారిగా కూతురితో ఏం చెప్పింది..? ఎక్స్‌క్లూజివ్
చెప్పడానికి ఏముంది?
కోర్టుకు హాజరుపరచడానికి ముందు పూర్ణ చందర్ మీడియాతో మాట్లాడాడు. తాను అమాయకుడినని.. తనకేమీ తెలియదన్నట్లుగా ప్రవర్తించాడు. అంతేకాదు తాను చెప్పా్ల్సినదంతా లెటర్‌లో చెప్పేశానని, ఇంతకుమించి తన దగ్గర చెప్పడానికి ఏమీ లేదని ఎంతో ధీమాతో సమాధానం చెబుతున్నాడు. అయితే.. స్వేచ్ఛ మృతికి తానే కారణమని పోలీసు విచారణలో పూర్ణ ఒప్పుకోవడం గమనార్హం. తన వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని విచారణలో పూసగుచ్చినట్లుగా చెప్పేశాడు. కొంతకాలంగా స్వేచ్ఛతో గొడవలు జరుగుతున్నాయని.. వీటి కారణంగానే మనస్తాపానికి గురై ఇలా జరిగిందని విచారణలో అతను చెప్పేశాడు. దీన్ని బట్టిచూస్తే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు నిజాలు బయటికి వచ్చేశాయి. కాగా, పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛను నమ్మబలికాడు. ఆ తర్వాత ఇరువురూ రిలేషన్ సాగించారు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పూర్ణను బాగా నమ్మింది స్వేచ్ఛ. అయితే చివరికి మోసం చేస్తున్నాడని తెలుసుకుని అతనితో విడిపోదామని నిర్ణయించుకున్నది. ఆఖరికి పెళ్లి విషయంలో చనిపోవడానికి ముందు కూడా స్వేచ్ఛతో పూర్ణ గొడవ పడినట్లుగా తెలుస్తున్నది.
Read Also- Prada Sandals: కాపీ కొట్టిన డిజైన్‌తో చెప్పులు.. రేటు తెలిస్తే గుండె గుభేలుమంటుంది ?