Simran Missing
Uncategorized, Viral, లేటెస్ట్ న్యూస్

Woman Missing: ఆమె ఏమైంది?.. అమెరికాలో భారతీయ పెళ్లి కూతురు మిస్సింగ్

Woman Missing: అగ్రరాజ్యం అమెరికాలో (USA) మరో భారతీయ యువతి కష్టాల్లో చిక్కుకుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునేందుకు అమెరికా వెళ్లిన 24 ఏళ్ల సిమ్రాన్ అనే యువతి అక్కడ అదృశ్యమైంది. జూన్ 20న ఇండియా నుంచి న్యూజెర్సీకి చేరుకున్న ఆమె, ఆ కొద్దిసేపటికే మిస్సింగ్ అయ్యింది. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా చేరుకున్న కొద్దిసేపటికే ఆమె చివరిసారిగా కనిపించిందని లిండెన్‌వోల్డ్ పోలీసులు తెలిపారు. సిమ్రాన్ తన ఫోన్‌ చూస్తున్నట్టుగా, ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టుగా వీడియోలో కనిపిందని వివరించారు. ఆమె ఆపదలో ఉన్నట్లుగా వీడియో చూస్తే అనిపించడంలేదని అధికారులు వివరించారు.

Read this- India Vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఖరారు!

సిమ్రాన్ బుధవారం అదృశ్యమవ్వగా, ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోయింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి ఆమె అమెరికా వచ్చినట్టుగా వెల్లడైందని వివరించారు. అమెరికా రావడానికి పెళ్లిని ఒక సాకుగా చూపించారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు ‘న్యూయార్క్ పోస్ట్’ ఒక కథనాన్ని ప్రచురించింది.

సిమ్రాన్‌కు అమెరికాలో బంధువులు ఎవరూ లేరని, ఇంగ్లీష్ మాట్లాడటం కూడా ఆమెకు రాదని పోలీసులు వివరించారు. ఆమె వాడుతున్న ఫోన్ వై-ఫై ద్వారా మాత్రమే పనిచేస్తుందని చెప్పారు. భారతదేశంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు ఎవర్నీ ఇప్పటివరకు సంప్రదించలేకపోయినట్టుగా అధికారులు వివరించారు. సిమ్రాన్ కుటుంబ సభ్యులు ఇండియాలో ఎక్కడ ఉంటారో తెలియదని లిండెన్‌వోల్డ్ పోలీసులు ఇదివరకే చెప్పారు. కాగా, సిమ్రాన్ 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, దాదాపు 68 కేజీల బరువు, నుదిటిపై ఎడమ వైపున చిన్న మచ్చ ఉంటాయని అధికారులు పోలికలు చెప్పారు. సిమ్రాన్ చివరిగా బూడిద రంగు స్వెట్‌ప్యాంట్, తెల్లటి టీ-షర్ట్, నల్లటి ఫ్లిప్-ఫ్లాప్‌లు, చిన్నపాటి వజ్రాలు పొదిగిన చెవిపోగులు ధరించి కనిపించిందని చెప్పారు. ఆమె ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, లిండెన్‌వోల్డ్ పోలీస్ డిటెక్టివ్ జో టోమసెట్టిని సంప్రదించాలని స్థానికుల్ని అభ్యర్థించారు.

Read this- Bollywood Heros: చీరలు కట్టిన బాలీవుడ్ హీరోస్.. పాలు పితుకుతున్న అక్షయ్ కుమార్.. వీడియో వైరల్

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్