Medchal Bonalu: మేడ్చల్(Medchal)లో సాంప్రదాయబద్ధంగా బోనాల(Bonalu) ఉత్సవ ప్రారంభం భక్తుల ఉత్సాహం, ఆరాధనతో జల్సాగా సాగిన వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రజల ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను, మేడ్చల్ పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ బోనాల ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం(Ashada month)లో నిర్వహింస్తారు. ఇది మహమ్మారి వంటి విపత్తుల నుంచి ఊరు రక్షించబడాలని కోరుతూ గ్రామ దేవతలకు ప్రత్యేకంగా నిర్వహించే పండుగ.
డప్పు చప్పుళ్ళు, పల్లె కళలతో నృత్యాలు
ఈ సంవత్సరం మేడ్చల్ పట్టణంలోని సూర్యనగర్ కాలనీ నుంచి ప్రారంభమై ఊరేగింపు భక్తిశ్రద్ధలతో జరిగింది. డప్పు చప్పుళ్ళు, పల్లె కళలతో నృత్యాలు(Dances), కోలాటం, పరుగు బందులు, మహిళల బతుకమ్మ పథంగలు వంటి స్థానిక కళారూపాలు ఈ ఊరేగింపును ప్రత్యేకంగా మలిచి ఉత్సావాలు జరుపుతున్నారు. భక్తులు తమ ఇళ్లలో తయారు చేసిన బోనాలను, అనగా అమ్మవారికి సమర్పించే ప్రత్యేక నైవేద్యాన్ని, గిన్నెలో బియ్యం, కూరగాయలు, నెయ్యితో నైవేద్యం చేసి తలపై ధరించి ఊరేగింపుగా తీసుకువచ్చారు. చివరికి గ్రామంలోని, ఏడుగుళ్ల వద్ద ఉన్న అమ్మవారి ఆలయంలో ఈ బోనాలను సమర్పించారు.
Also Read: Rapido: చంద్రబాబు చెబితేనే రాపిడో స్థాపించారా.. నిజమెంత?
విష్ణు శౌర్య ఆధ్వర్యంలో
ఈ ఉత్సవాన్ని విష్ణు శౌర్య ఆధ్వర్యంలో భక్తులు నిర్వహించగా, ఆయన అనుచరులు, స్థానిక మహిళలు, యువత, వృద్ధులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒడి బియ్యం కూడా అమ్మవారికి సమర్పించారు. ఇది తెలంగాణలో పంటల సమృద్ధిని కోరే విధానంగా భావించబడుతుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా దృష్ట్యా, మేడ్చల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, మెడికల్ సపోర్ట్, అంబులెన్స్‌లు కూడా సిద్ధంగా ఉంచారు.
ప్రత్యేకతలు
కొంతమది మహిళలు తమ మొక్కులు తీర్చుకుంటూ చేతులపై మంటలు వేసుకుని నృత్యం చేసి దేవతకు పూజిస్తుతున్నారు. చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, యువత తాళ్లు, లడ్డూ మేళాలు మోస్తూ ఊరేగింపు చేయడం ఈ వేడుకలకు ఆకర్షణగా నిలిచాయి. స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ విధంగా మేడ్చల్ పట్టణంలో ప్రారంభమైన బోనాల పండుగ, రాబోయే వారాల్లో కూడా పలు కాలనీల్లో, గ్రామాల్లో కొనసాగనుంది. ఇది తెలంగాణ సంస్కృతి సజీవంగా ఉన్నదని మరోసారి చాటిచెప్పవచ్చు.
Also Read: Illegal Sand Transportation: జోరుగా సాగుతున్న ఇసుక మాఫియా.. పట్టించుకోని అధికారులు