MLC Kavitha
Politics

MLC Kavitha: కవిత భేటీలపై రాజకీయ చర్చ.. ఎందుకిలా?

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఓవైపు బీజేపీపై విమర్శలు, మరోవైపు ఆ పార్టీకి దగ్గరి నేతలతో చర్చలు జరుపుతుండడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు ఆమె లక్ష్యం ఏంటి, ఏ అంశంతో వెళ్తున్నారు అనేది కూడా చర్చకు దారితీసింది. గులాబీ పార్టీ అని చెప్పుకుంటూ జాగృతి సంస్థ పేరుతో కవిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  అయితే, కేంద్రమంత్రి రాందాస్ అథవాలేతో గంటకు పైగా చర్చించడంతో బీసీ రిజర్వేషన్ అంశమా? లేకుంటే బీజేపీ రాయభారమా? అనేది విస్తృత చర్చకు దారి తీసింది.

జాగృతి పేరుతో ప్రజాసమస్యలపై గళం

ఎమ్మెల్సీ కవిత నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జాగృతి సంస్థ పేరుతో ప్రజాసమస్యలపై గళం వినిపిస్తున్నారు. ఇరిగేషన్‌పై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతున్నారు. యువతపై ఫోకస్ పెట్టి వారిని జాగృతి సంస్థలో జాయిన్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. అంతేకాదు ప్రధానంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంతో జూలై 17న రైల్ రోకోకు కవిత పిలుపునిచ్చారు. అన్ని రాజకీయపార్టీల మద్దతు కోరుతున్నారు. ఇప్పటికే బీసీసంఘాలు, వామపక్ష పార్టీలతోనూ భేటీ అయ్యారు. వారి మద్దతు కోరారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ జాగృతి సంస్థ తరపున కార్యక్రమాలు చేపడుతూ నిత్యం మీడియాలో ఉంటున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

కేంద్రమంత్రిని ఎందుకు కలిశారు?

బీసీ రిజర్వేషన్‌ల కోసం పోరాట బాట పట్టిన కవిత శుక్రవారం కేంద్రమంత్రి రాందాస్ అథవాలేతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది. కేంద్రంపై విమర్శలు చేస్తున్న కవిత, కేంద్రమంత్రిని ఎందుకు కలిశారనేది హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రంపై పోరాటంతో ఒత్తిడి పెంచాలని భావిస్తున్న కవిత ఒక్కసారిగా రాందాస్ అథవాలేతో సమావేశం ఎందుకు అయ్యారనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పాటు జాగృతి క్యాడర్‌లోనూ చర్చ జరుగుతుంది. సుమారు గంటకు పైగా చర్చ జరపడం వెనుక ఆంతర్యమేంటనేది చర్చకు దారితీసింది. చర్చలో తాజా రాజకీయాలు సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం. అదే విధంగా జాగృతి చేపడుతున్న కార్యక్రమాలను సైతం కవిత వివరించినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సైతం చర్చకు రాగా మద్దతు ఇవ్వాలని కవిత ఆథవాలేను కోరారు. అయితే, కవిత రిజర్వేషన్లపైనే చర్చించారా? లేకుంటే బీజేపీ రాయబారమా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Read Also- Telangana: ఇదేందయ్యా ఇది.. చనిపోయిన వారికి ఐదేళ్లుగా పెన్షన్!

బీజేపీ మళ్లీ ఏమైనా ప్రపోజల్ పంపిందా?

గత నెల 29న కవిత మీడియా చిట్‌ చాట్ నిర్వహించారు. ఆ చిట్ చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను జైళ్లో ఉన్నప్పుడు నా దగ్గరకు ప్రపోజల్ తీసుకొచ్చారని దానిని నేను వ్యతిరేకించానని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాకుండా స్వత్రంతంగా ఉండాలన్నదే నా అభిమతం అని పేర్కొన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని గులాబీ పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్‌ను బీజేపీకి అంటగట్టాలనే యత్నం ఇంకా జరుగుతుందని, బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ కాంగ్రెస్‌కు లాభం జరుగుతుందని తెలిపారు. అయితే, ఇప్పుడు కవిత కేంద్రమంత్రి అథవాలేతో ఎందుకు భేటీ అయ్యారు. బీజేపీ మద్దతు కోరాలనుకుంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో భేటీ కావాలి. అంతేకాదు కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డిలు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారితో సమావేశం కావాలి. వారిపై ఒత్తిడికి వారి ఇళ్ల ముట్టడి కానీ, నిరసన కార్యక్రమాలు గానీ చేపట్టాల్సి ఉందని, కానీ ఆ పని చేయకుండా వారి మద్దతు కోరకుండా రాందాస్ అథవాలేతో భేటీ కావడంతో హాట్ టాపిక్ అయింది. కేంద్రంలోని బీజేపీ మళ్లీ ఏమైనా గులాబీపార్టీపై ప్రపోజల్ పంపిందా? అనే ప్రచారం సైతం ఊపందుకుంది. అయితే ఈ భేటీని మాత్రం రిజర్వేషన్ల అంశం అని చెబుతున్నప్పటికీ కేంద్రం మాత్రం ఏదో అంశాన్ని చేరవేసిందనే సమాచారం.

ఎంపీ సందోష్ కుమార్‌ భేటీతో రాజకీయ ప్రాధాన్యత

జాగృతి పటిష్టంలో భాగంగానే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కవిత, బీసీ అంశంపై పార్టీల మద్దతు కోరుతున్నారు. తాజాగా సీపీఐ ఎంపీ సందోష్ కుమార్‌ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఆయన మాత్రం వివరణ ఇచ్చారు. కవితను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, ఆమె ఆహ్వానంపైన మర్యాద పూర్వ కంగా కలిసినట్లు వివరణ ఇచ్చారు. రాజకీయ, ఇతర అంశాలపై మా మధ్య చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కవిత బీఆర్ఎస్ పార్టీకి జాగృతి అనుబంధ సంస్థ గా చెబుతున్నప్పటికీ ఆమె చేపట్టే కార్యక్రమాలకు మాత్రం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనకపోవడం ఇప్పటికే విస్తృత చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కవిత నేతలతో భేటీలు మాత్రం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది.

Read Also- Andhra Pradesh: ఏపీ ప్రజలకు తీపికబురు.. ఇకపై ఇంటికి నేరుగా..!

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?