Jurala Dam (imagcredit:swetcha)
నార్త్ తెలంగాణ

Jurala Dam: డ్యాం రిపేర్ చేయకుంటే భవిష్యత్తు అంధకారమే!

Jurala Dam: జూరాల డాం(Jurala Dam) భద్రతపై అనేక సందేహాలు ఉన్న ఇరిగేషన్(Irrigation) మంత్రి డ్యాం భద్రంగా ఉందని పేర్కొనడం శోచనీయమని మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహా రెడ్డి(Bharata Simha Reddy) అన్నారు. ఆయన గద్వాల పట్టణంలోని డికె. బంగ్లా లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు డీకే భరత సింహారెడ్డి మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు సేఫ్‌గా ఉందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Min Uttam Kumar Reddy) చెప్పిన మాటలు అబద్ధమని అన్నారు. డ్యామ్ నిర్మాణ సమయంలో సొరంగం ఉందని దానిలోకి బురద వెళ్లిందంటే డ్యామ్ ఎప్పుడు తేమ శాతంతో ఉండి ఎప్పుడైన ప్రమాదం గురి కావచ్చని సొరంగంలోకి వెళ్లడానికి రెండు లిఫ్టులు(Lifts) ఉన్నాయని అవి మూసుకుపోయి 8 ఏళ్ళు అయ్యిందన్నారు. ఏ ఒక్క అధికారి కూడ అందులోకి పోయి లోన సిల్ట్‌(Steel)తో పాటు ఏమైన పేరుకు పోయిందా అని చూసే నాథుడే లేడన్నారు. డ్యాం భద్రంగా ఉందని నిపుణులు మన సాక్షిగా చెబితే నేను ముక్కును నీళ్ళకు రాయడానికి సిద్ధంగా ఉన్నాను.

Also Read: Viral Video: రోడ్డుపై నడుం లోతు నీళ్లు.. ఎంచక్కా స్కూటీపై వెళ్లిన వ్యక్తి.. వీడియో వైరల్!

పేరుకుపోయిన సిల్డ్ తీయని ప్రభుత్వం

ప్రాజెక్టులో సిల్ట్ పేరుకుపోయిందని, దాని వలన డ్యామ్ పునాదిపై ఓత్తిడి పెరిగిపోతున్నదని, ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి గురించి తెలియని మంత్రి ప్రాజెక్టు సేఫ్‌గా ఉందని చెప్పడం మంత్రికి తగదన్నారు.
అంతర్గతంగ ఉన్న ఎనిమిది మీటర్లలో పేరుకుపోయిన సిల్డ్ తీయని ప్రభుత్వం ప్రాజెక్టులో పేరుకుపోయిన సిల్ట్ తీస్తామని అంటున్నారని అన్నారు. డ్యాం పై 18 టన్నుల లోడ్‌తో వాహనాలు రాకపోకలు చేసావని, ప్రస్తుతం 40 నుంచి 50 టన్నుల మేరకు భారీ వాహనాలు వెళుతున్నాయని దీంతో డ్యాం పై అదనపు భారం పడుతుందన్నారు. క్రస్ట్ గేటు తెగిపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పనులు చేసేవారికి బిల్లులు చేయకపోతే కాంట్రాక్టర్లు పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

నాలుగుళ్ళు అయిన ఆడిగే నాథుడే లేడు

ర్యాలంపాడు కాలువలు ఇప్పటి వరకు పూర్తి కాలేదని ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలకు నాలుగుళ్ళు అయిన ఆడిగే నాథుడే లేడన్నారు. గద్వాలలో పెత్తందారి వ్యవస్థ నడుస్తుందని, దీని వలన ఉన్నోడి చేతిలోకి డబ్బు పోతున్నదని, సీడ్ వ్యవస్థ మొత్తం నాశనం అయ్యిందని, కొన్నేళ్లలో ఇక్కడ సీడ్ వ్యవస్థ ఉండదని వివరించారు. గద్వాల అభివృద్ధి పూర్తిగా వెనకబడి పోయిందని ఆయన వివరించారు.

Also Read: Mallu Ravi: కవిత కంటే పెద్ద అవినీతిపరులు ఎవరూ లేరు.. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?