Phone Tapping Case: ఫోన్​ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ సంచలనం
Phone Tapping Case (imagcredit:twitter)
Telangana News

Phone Tapping Case: ఫోన్​ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ సంచలనాలు

Phone Tapping Case: ఫోన్​ట్యాపింగ్(Phone Tappimg) కేసులో తవ్వినాకొద్ది సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కేసీఆర్(KCR) తనయ, జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) వద్ద పని చేస్తున్న వారి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా సిట్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలో కవిత పీఏ(PA)తోపాటు ఆమె వద్ద పని చేస్తున్న మరొకరికి వాంగ్మూలం ఇవ్వటానికి రావాలని నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఇక, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Min Ponguleti Srinivass Reddy), వివేక్ వెంకటస్వామి(Vivek), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)తోపాటు కాంగ్రెస్(Congress)​ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి(MLA Rajagopal Reddy) ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు సిట్ అధికారుల విచారణలో తేలిందని తెలియవచ్చింది.

నల్గొండ జిల్లాలో కీలకపాత్ర 

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొంగులేటి(Ponguleti) ఖమ్మం జిల్లాలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) నల్గొండ జిల్లాలో కీలకపాత్ర వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో పొంగులేటి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్(BRS) ను ఒక్క స్థానంలో కూడా గెలవనీయమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఫోన్ తోపాటు ఆయన సన్నిహితుల ఫోన్లను కూడా ప్రణీత్ రావు(Praneeth Rao) టీం ట్యాప్ చేసినట్టుగా సమాచారం. మునుగోడు(Munugodu) ఎన్నికల సమయంలో రాజగోపాల్​రెడ్డి, ఆయన సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా వెల్లడైందని తెలిసింది. త్వరలోనే వీరందరి నుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకోనున్నట్టు సమాచారం.

Also Read: Medical Reimbursement Bills: ప్రభుత్వ ఉద్యోగుల..పెన్షనర్లకు గుడ్ న్యూస్!

బీఆర్ఎస్​ఎమ్మెల్యేలవి సైతం

ఇదిలా ఉండగా ఎస్​ఐబీ ఛీఫ్‌గా ప్రభాకర్​రావు ఉన్న సమయంలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్ రావు టీం బీఆర్ఎస్​ పార్టీకే చెందిన పలువురు ఎమ్మెల్యేలతోపాటు నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా సిట్ విచారణలో తేలిందని సమాచారం. ఈ క్రమంలో వీరిని కూడా ఒకరొకరిగా పిలిపించి వాంగ్మూలాలు తీసుకోవాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది.

Also Read: Hanamkonda News: రాష్ట్రంలో ఘోరం.. మహిళను వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి.. అతి దారుణం!

 

Just In

01

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..