Ileana with Her Second Baby
ఎంటర్‌టైన్మెంట్

Ileana: రెండో బిడ్డకు జన్మినిచ్చిన ఇలియానా.. సెలబ్రిటీలు ఆపుకోలేకపోతున్నారు

Ileana: ఇలియానా (Ileana DCruz) గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆమె ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కు కాస్త దూరంగా ఉంటుంది కానీ, ఆమె చిత్రాలు మాత్రం ఇప్పటికీ సందడి చేస్తూనే ఉంటాయి. తాజాగా ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చినట్లుగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ విషయం తెలుపుతూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆమె మళ్లీ మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు కూడా ఇలియానా మగబిడ్డకే జన్మనిచ్చారు. తాజాగా ఆమె చేసిన పోస్ట్‌లో పిల్లాడి పేరు కూడా తెలుపుతూ.. ఆమె ఎంత సంతోషంగా ఉన్నారో తెలిపారు. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్‌లో..

Also Read- SJ Suryah: పదేళ్ల తర్వాత మళ్లీ దర్శకుడిగా.. ఏయ్ సుధా విన్నావా?

రెండో బిడ్డకు సంబంధించిన ఫొటోని షేర్ చేసిన ఇలియానా.. ‘మా ప్రియమైన కుమారుడు ‘కియాను రఫే డోలన్‌’ (Keanu Rafe Dolan)ని పరిచయం చేస్తున్నందుకు మా హృదయాలు ఎంతో సంతోషంతో నిండిపోయాయి’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన సెలబ్రిటీలు అస్సలు ఆగలేకపోతున్నారు, ఆపుకోలేకపోతున్నారు. అందుకే ‘కంగ్రాట్స్’ అంటూ కామెంట్స్‌తో ఇలియానాకు మరింత సంతోషాన్నిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, సమంత, మలైకా అరోరా, అతియా శెట్టి, సోఫియా చౌదరి, పూజా జావేరి, అంజనా సుఖానీ, రిధి తివారీ, డింపుల్ హయాతి, ప్రియాంకా దేశ్ పాండే, అక్ష వంటి వారంతా ఇలియానా పోస్ట్‌కు రియాక్ట్ అవుతూ, ఇలియానా దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Also Read- Varalaxmi Sarathkumar: పెళ్లైన ఏడాదికే వరలక్ష్మి ఇలా చేసిందేంటి.. భర్త పరిస్థితేంటి?

ఇక ఇలియానా విషయానికి వస్తే 2023లో మైఖేల్ డోలన్ అనే అతనిని ఆమె వివాహం చేసుకున్నారు. అయితే వివాహానికి ముందే ఆమె ప్రెగ్నెంట్ అనేలా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెంట్ అయ్యిందని ఇలియానాపై అప్పట్లో వార్తలు తెగ హల్చల్ చేశాయి. ప్రెగ్నెంట్ అనే విషయం బయటికి వచ్చింది కానీ, ఆమె ఎవరితో రిలేషన్‌లో ఉందనే దానిపై కొన్నాళ్లపాటు కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది. ఆ తర్వాత లైన్‌లోకి మైఖేల్ వచ్చారు. ఈ జంటకు 2023 ఆగస్ట్‌లో ‘కోవా ఫీనిక్స్ డోలన్’ అనే బాబు జన్మించారు. బాబు పుట్టిన తర్వాత ఇలియానా.. అతడే తన సర్వస్వం అనేలా కొన్ని పోస్ట్‌లు చేస్తూ వచ్చింది. తన ప్రెగ్నెన్సీని కూడా ఆమె ఎంతగానో ప్రేమించింది. ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెలియజేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా జూన్ 19న తనకు బేబి బాయ్ జన్మించాడని తెలుపుతూ.. అతని పేరుతో సహా.. అందరికీ తెలియజేసింది. ఇక తన జీవితంలో తనకు ఎంతో ఆనందం లభించినట్లుగా ఇలియానా తన పోస్ట్‌లో పేర్కొంది. ఈ న్యూస్‌తో ఆమె అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు