SJ Suryah Movie Opening
ఎంటర్‌టైన్మెంట్

SJ Suryah: పదేళ్ల తర్వాత మళ్లీ దర్శకుడిగా.. ఏయ్ సుధా విన్నావా?

SJ Suryah: కోలీవుడ్, టాలీవుడ్‌లో బిజీగా ఉన్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఎవరయ్యా? అంటే కచ్చితంగా ఎస్.జె సూర్య పేరే వినిపిస్తుంది. అంతకు ముందు దర్శకుడిగా సినిమాలు చేసిన ఎస్.జె. సూర్య, ఆ తర్వాత హీరోగానూ కొన్ని సినిమాలు చేశారు. దర్శకుడిగా సక్సెస్ అయ్యారు కానీ, హీరోగా మాత్రం ఆయన అనుకున్నంత స్థాయికి చేరుకోలేకపోయారు. అయితేనేం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా దూసుకెళుతున్నారు. పలు భాషల్లో ఆయన బిజీ నటుడిగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల మళ్లీ దర్శకత్వం ఎప్పుడు చేస్తారు? అని అడిగినప్పుడు ‘ఖుషి 2’ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌తో చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. ఆ సమయం కోసం మెగా ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. కానీ, ఆయన నటన వదిలి మళ్లీ దర్శకుడిగా ఎప్పటికి వస్తారో? ఎందుకంటే, ప్రస్తుతం ఆయన అంత బిజీ నటుడిగా మారిపోయారు. ఎస్‌జె సూర్య ఎప్పుడెప్పుడు దర్శకత్వం చేస్తాడా? అని ఎదురు చూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ వచ్చేసింది.

Also Read- Siddharth: స్టేజ్‌పైనే కంటతడి పెట్టుకున్న హీరో సిద్ధార్థ్.. నన్ను ఏడిపిస్తున్నారంటూ..

ఈ మల్టీ టాలెంటెడ్ సూపర్‌స్టార్ దాదాపు పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆయన దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకోబోతుంది. ఈ సినిమాకు టైటిల్‌ను కూడా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్ (Sri Gokulam Movies) (గోకులం గోపాలన్ నేతృత్వంలో), ఎస్‌జె సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ (Angel Studios) సంయుక్తంగా నిర్మించనున్న ఈ భారీ పాన్‌ ఇండియా చిత్రానికి ‘కిల్లర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా.. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తనే సమకూరుస్తున్నారు. తెలుగు, మలయాళ, కన్నడ తదితర భాషలలో సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన గోకులం మూవీస్, ఈ సినిమాతో తమిళ సినీ రంగంలోకి కం బ్యాక్ ఇస్తోంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు వి.సి. ప్రవీణ్, బైజు గోపాలన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కృష్ణమూర్తి వ్యవహరిస్తున్నారు.

Also Read- Thammudu: దిల్ రాజు సినిమాకు సెన్సార్ నుంచి ఆ సర్టిఫికెట్ వచ్చిందేంటి?

‘వాలి’, ‘ఖుషీ’, ‘న్యూ’ వంటి క్లాసిక్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్‌జె సూర్య, ‘కిల్లర్’ సినిమాకు స్టార్ స్టడెడ్ తారాగణాన్ని తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు భాషలలో విడుదల కానుంది. ఇది ట్రూ పాన్‌ ఇండియా అనుభూతిని ఇవ్వనుందని, ఈ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్థాయి సినిమా ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని నిర్మాతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతిభ గల నటులు, సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రంగా ఈ సినిమాను రూపొందించబోతున్నామని అన్నారు. త్వరలోనే ఈ చిత్ర తారాగణం, సాంకేతిక బృందం వంటి వివరాలను తెలియజేస్తామని వారు వెల్లడించారు. ఇక ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి.. ‘ఏయ్ సుధా మనోడు దర్శకత్వం చేస్తున్నాడంటరా’ అంటూ సరదాగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు