Thammudu Poster
ఎంటర్‌టైన్మెంట్

Thammudu: దిల్ రాజు సినిమాకు సెన్సార్ నుంచి ఆ సర్టిఫికెట్ వచ్చిందేంటి?

Thammudu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు (Dil Raju)కు, ఆయన బ్యానర్‌కు ఒక బ్రాండ్ ఉంది. టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఆయనొకరు. ఆయన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) నుంచి సినిమా వస్తుందంటే.. మంచి కంటెంట్‌తో సినిమా వస్తుందనే నానుడి ఇప్పటి వరకు ఉంది. ఇకపై కూడా ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ ఎవరికైనా ఉంటాయి. అవి దిల్ రాజుకు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ బ్రేక్స్‌ నుంచి దిల్ రాజు బయట పడినంత తొందరగా వేరే ఏ నిర్మాత పడలేరు. కారణం ఆయన విజన్ అలా ఉంటుంది. ఈ సినిమాతో డబ్బులు పోతే.. నెక్స్ట్ ఇంకో సినిమా డబ్బులు తీసుకురావడానికి రెడీగా ఉంటుంది. అలా ఉంటుంది దిల్ రాజు ప్లానింగ్. అందుకు ఉదాహరణ ఈ సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలే. అలా మ్యానేజ్ చేస్తూ వస్తుంటారు.

Also Read- Kannappa Movie: బ్రేకింగ్.. కన్నప్ప పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. మంచు విష్ణు పై కేసు పెడతామంటూ వార్నింగ్

మ్యాగ్జిమమ్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే.. ఫ్యామిలీ అంతా హాయిగా సినిమా చూడవచ్చనే ఫీలింగ్ అందరిలో ఉంది. అందుకే ఈ బ్యానర్‌కు అంత సక్సెస్ రేట్ ఉంది. కాకపోతే.. ఈ బ్యానర్‌లో ప్రస్తుతం నిర్మితమవుతోన్న నితిన్ ‘తమ్ముడు’ (Nithiin Thammudu) చిత్రం మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కాదు అనేలా సెన్సార్ నుంచి సర్టిఫికెట్ జారీ అయింది. అయినా సరే దిల్ రాజు, మారు మాట్లాడకుండా అదే సర్టిఫికెట్‌తో తన ‘తమ్ముడు’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఎస్వీసీ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న ‘తమ్ముడు’ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ను దిల్ రాజు తీసుకున్నారు. సెన్సార్ వాళ్లు కొన్ని కట్స్ చెప్పి, వాటిని తొలగిస్తే సినిమాకు ‘యుబైఏ’ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పినా.. దిల్ రాజు మాత్రం వినలేదని తెలుస్తుంది. ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు సన్నివేశాలేవీ తొలగించకుండా ఉండాలని ‘ఏ’ సర్టిఫికెట్‌నే దిల్ రాజు తీసుకున్నారని తెలుస్తోంది.

Also Read- Niharika Konidela: నిహారిక నిర్మిస్తోన్న నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ ఎవరంటే..

ఆయన ‘ఏ’ సర్టిఫికెట్ తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఏ తరహా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయో ఒక స్పష్టతకు వచ్చామని తెలిపారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి కంప్లీట్ ఎంటర్‌టైనర్స్ లేదా సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అందుకే ‘తమ్ముడు’ సినిమాతో ఒక కొత్త తరహా సినిమాటిక్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు కట్స్ లేకుండా ‘ఏ’ సర్టిఫికెట్ తీసుకునేందుకు దిల్ రాజు మొగ్గుచూపారని టాక్ నడుస్తుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ‘తమ్ముడు’ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చేందుకు రెడీ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..