A Special Commission Of Inquiry To Find The Culprits in the Kaleswaram Project
Politics

Kaleshwaram: కాళేశ్వరం ఎంక్వైరీ.. స్పీడప్!

– కాళేశ్వరంపై జ్యుడీషియల్ దర్యాప్తు ముమ్మరం
– పీసీ ఘోష్ కమిషన్ వరుస భేటీలు
– ఇరిగేషన్ అధికారులతో చర్చలు
– రేపు, ఎల్లుండి కూడా మంతనాలు
– ఎన్‌డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్, సాండ్ రిపోర్టులపై చర్చ
– జూన్ 30లోగా నివేదిక అందించే ఛాన్స్

PC Ghosh Commission: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్ల కుంగుబాటు, నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ సారథ్యంలో ఎంక్వైరీ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇటీవలే బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించింది. బ్యారేజీలను పరిశీలించి సాంకేతిక అంశాలనూ సేకరించింది. ఎన్‌డీఎస్ఏ మధ్యంతర నివేదికతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలో తెలుసుకున్న అంశాలు, ప్రజాభిప్రాయ సేకరణలో తమ దృష్టికి వచ్చిన విషయాలు, కాగ్, విజిలెన్స్, సాండ్ రిపోర్టులపై పీసీ ఘోష్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గురువారం బీఆర్కే భవన్‌లో ఇరిగేషన్ అధికారులు, ఈఎన్సీలు నాగేందర్, అనిల్ కుమార్‌లతో భేటీ అయ్యారు. దర్యాప్తును ముమ్మరం చేసి జూన్ 30వ తేదీలోగా రిపోర్టును ప్రభుత్వానికి అందించాలని కమిషన్ భావిస్తున్నది.

పీసీ ఘోష్ కమిషన్ విజ్ఞప్తి మేరకు ఎన్‌డీఎస్ఏ మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందించింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా పిల్లర్ల కుంగుబాటుకు కారణం అని ఆ నివేదికలో ఎన్‌డీఎస్ఏ పేర్కొన్నట్టు తెలిసింది. 2019 జూన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిందని, నవంబర్‌లోనే బ్యారేజీలో పలు లోపాలు బయటపడ్డాయని పొందుపరించింది. ఏడవ బ్లాకులో 19 నుంచి 22 వరకు కుంగిన పిల్లర్లను మరమ్మతు చేసినా పూర్తి స్థాయిలో గ్యారెంటీ ఇవ్వలేమనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్టు సమాచారం. మిగిలిన పిల్లర్లకు సంబంధించి మరింత అధ్యయనం చేయాలని నివేదికలో సూచించింది. అలాగే, తాత్కాలిక మరమ్మతులు చేయాలనే ప్రస్తావననూ ఎన్‌డీఎస్ఏ తెచ్చినట్టు తెలిసింది. ఈ అంశంపై పీసీ ఘోష్ కమిషన్ సీరియస్‌గా చర్చిస్తున్నట్టు సమాచారం.

Also Read: కాంగ్రెస్‌లో చేరికల సందడి.. పార్టీలో చేరిన శ్రీకాంతాచారి తల్లి

పీసీ ఘోష్ కమిషన్ రేపు, ఎల్లుండి కూడా వరుస సమావేశాలు నిర్వహించనుంది. ఎన్‌డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్, సాండ్ రిపోర్టు‌లపై కూలంకషంగా చర్చించనుంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత వివరాలన్నీ క్రోడీకరించి ఎవరికి నోటీసులు ఇవ్వాలనే అంశాన్ని కమిషన్ పరిశీలించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందన్న ఆరోపణలు రావడంతో దానిపైనా కమిషన్ ఎంక్వైరీ చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు టెండర్ మొదలై 2019 జూన్‌ పూర్తయ్యే నాటికి జరిగిన పరిణామాలను పరిశీలించి అవసరమైన వారిని పిలిచి పీసీ ఘోష్ కమిషన్ విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 32 డిపార్ట్‌మెంట్లు, పలు ఏజెన్సీలు ఉన్నాయి. వీటితోపాటు గత ప్రభుత్వంలోని పెద్దలను కూడా పిలిచి విచారించే చాన్స్ ఉన్నది.

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?