Sand Mafia: సాండ్ సిండికేట్‌పై నిఘా వర్గాల ఫోకస్
Sand Mafia Khammam
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Sand Mafia: సాండ్ సిండికేట్‌పై నిఘా వర్గాల ఫోకస్

  • ఖమ్మం గుమ్మంలో సాండ్ మాఫియా ఆగడాలు
  • గుట్టంతా బయటపెట్టిన ‘స్వేచ్ఛ’
  • ⁠జీర్ణించుకోలేకపోతున్న బినామీ కాంట్రాక్టర్స్
  • స్వేచ్ఛ కథనాలను ఆపేందుకు చర్ల పీఎస్‌లో ట్రైబల్ సొసైటీలతో అక్రమ ఫిర్యాదు? ⁠
  • జీఎస్టీ వ్యవహారం బయటపడడంతో ఒక్కటైన అందరూ!
  • పుష్ప మాదిరి సిండికేట్ వ్యవహారాలు
  • ‘స్వేచ్ఛ’ కథనాలతో రంగంలోకి ఇంటెలిజెన్స్
  • టీజీఎండీసీ ఆదేశాలతోనే ఫిర్యాదులు ఇచ్చారని శ్రీకర్ ప్రచారం!
  • సాండ్ సిండికేట్‌ అక్రమాలు చెబితే ఎంతకైనా బరి తెగించేందుకు సిద్ధమైందా!

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్


Sand Mafia: ఖమ్మం కేంద్రంగా ఇసుక మాఫియా సాగిస్తున్న ఆగడాలపై ‘స్వేచ్ఛ’ వరుస కథనాలు ప్రచురించింది. మాఫియా అంతా సిండికేట్‌గా ఫామ్ అయి చేస్తున్న వ్యవహారాలను బయటపెట్టింది. ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్న శ్రీకర్ తీరుపై ఆధారాలతో వార్తలు ప్రచురించింది. పర్యావరణ రీచ్‌లలో సాగిస్తున్న ఉల్లంఘనలను ‘స్వేచ్ఛ’ బయటపెట్టింది. పదేళ్లలో శ్రీకర్ సాగించిన లీలలన్నీ, గత ప్రభుత్వం దోచిపెట్టిన తీరు ఇలా అన్నీ వివరించింది.

స్వేచ్ఛ కథనాలపై ఇంటెలిజెన్స్ ఆరా


‘స్వేచ్ఛ’ ప్రచురించిన సాండ్ సిండికేట్ కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఖమ్మం కేంద్రంగా ఇంత వ్యవహారం నడుస్తున్నదా అని ప్రజలు తెగ మట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ, అధికారుల వర్గాల్లోనూ అంశం చర్చనీయాంశమైంది. విషయం ఇంటెలిజెన్స్ చెవిన పడింది. దీంతో రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ఖమ్మం సాండ్ సిండికేట్ వ్యవహారాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియా తీగ లాగితే డొంకంతా కదులుతుందని అంతా అనుకుంటున్నారు.

Read Also- Telugu Heroes: ఆటో డ్రైవర్ గా మహేష్ బాబు.. జ్యూస్ అమ్ముతున్న హీరో రామ్ చరణ్.. వీడియో వైరల్

స్వేచ్ఛ కథనాలను ఆపాలంటూ ఫిర్యాదు!

మరోవైపు, నిజాలను నిర్భయంగా ప్రచురిస్తున్న ‘స్వేచ్ఛ’ కథనాలను బినామీ కాంట్రాక్టర్స్ ⁠జీర్ణించుకోలేకపోతున్నారు. స్వేచ్ఛ వార్తలను ఆపేందుకు చర్ల పోలీస్ స్టేషన్‌లో ట్రైబల్ సొసైటీలతో అక్రమ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. జీఎస్టీ వ్యవహారం మొత్తం బయటపడడంతో అందరూ ఒక్కటైనట్టు సమాచారం.

Read Also- Man Suicide Attempt: డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయలేదని వ్యక్తి హల్చల్

Just In

01

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..