Niharika Konidela: 2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం, బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu). యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పించిన విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్ (Gaddar Awards)లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు, చిత్ర దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కూడా అవార్డ్ వచ్చింది. తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన ఈ సక్సెస్‌ఫుల్ బ్యానర్‌లో ఇప్పుడు రెండో చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు.. మరోవైపు క్యాస్టింగ్ ఎంపిక కూడా జరుగుతోంది.
Also Read- Telugu Heroes: ఆటో డ్రైవర్ గా మహేష్ బాబు.. జ్యూస్ అమ్ముతున్న హీరో రామ్ చరణ్.. వీడియో వైరల్
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ రెండో సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల్లో నటించి, నటుడిగా ఎంతగానో ఆకట్టుకున్న యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారనే విషయం తెలియంది కాదు. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌ని ఫైనల్ చేశారు. హీరోయిన్ ఎవరో తెలుపుతూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుంది. ‘ఆయ్, క’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, మెప్పించిన నయన్ సారిక.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన జీ5 వారి ‘హలో వరల్డ్’, సోనీ లివ్ వారి ‘బెంచ్ లైఫ్’ వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా తెలుగుకి పరిచయయ్యారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు.
Also Read- Lenin Movie: శ్రీలీల పోతేనేం.. అఖిల్ కోసం మరో కత్తిలాంటి ఫిగర్‌ని పట్టారుగా!
జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా, సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేసి, ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ రూపొందించబోతున్న ఈ సినిమాతో ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రధాన పాత్రలో నటించారు. నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా, మహేష్ ఉప్పల కో- రైటర్‌గా స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని ప్రస్తుతం PEP2 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరపబోతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు