Lenin Movie Heroine
ఎంటర్‌టైన్మెంట్

Lenin Movie: శ్రీలీల పోతేనేం.. అఖిల్ కోసం మరో కత్తిలాంటి ఫిగర్‌ని పట్టారుగా!

Lenin Movie: మ్యారేజ్ తర్వాత అక్కినేని అఖిల్ (Akhil Akkineni) చేస్తున్న సినిమా ‘లెనిన్’ (Lenin). ఇప్పటి వరకు సరైన హిట్ లేని అఖిల్.. పెళ్లి తర్వాత చేస్తున్న సినిమాతోనైనా హిట్ కొట్టి, మ్యారేజ్ తర్వాత హిట్టొచ్చిన హీరోల జాబితాలోకి చేరుతాడని.. అక్కినేని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. కాకపోతే, ఈ సినిమా కూడా ఆశించినట్లుగా ముందుకు వెళ్లడం లేదనేలా టాక్ నడుస్తుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ శ్రీలీల (Sreeleela).. యూనిట్‌ను బాగా ఇబ్బంది పెడుతుందనేలా ఈ మధ్య వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ (Mass Jathara) షూటింగ్‌తో పాటు, సడెన్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ కూడా పున: ప్రారంభం కావడంతో.. ‘లెనిన్’‌కు డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పెడుతోందట. దీంతో ఆమెని ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్సే తప్పించారని తాజాగా వార్తలు బయటికి వచ్చాయి.

Also Read- Kuberaa: ‘కన్నప్ప’ రిజల్ట్‌పైనే ‘కుబేర’ ఆశలు.. తమిళనాడులో మరీ ఘోరం!

అంతేకాదు, ఇప్పుడామె ప్లేస్‌లో కత్తిలాంటి హీరోయిన్‌ని సెట్ చేసినట్లుగా టాక్ నడుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఇంతకు ముందు మాస్ మహారాజా రవితేజతో హరీష్ శంకర్ చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse). శ్రీలీల పోయిందని బాధపడుతున్న అభిమానులు.. ఇప్పుడు భాగ్యశ్రీ ఆ స్థానంలో చేరిందని తెలియగానే హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే భాగ్యశ్రీ బోర్సేకు కూడా సరైన హిట్ లేదు. ఆమె చేసిన ఒకే ఒక్క సినిమా ‘మిస్టర్ బచ్చన్’ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కానీ, ఆమె గ్లామర్, డ్యాన్స్‌లు మాత్రం అందరినీ కట్టి పడేశాయి. ‘మిస్టర్ బచ్చన్’ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది భాగ్యశ్రీ బోర్సే. అందులో ఒకటి రామ్ పోతినేని సరసన చేస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ అయితే, రెండోది విజయ్ దేవరకొండ సరసన చేస్తున్న ‘కింగ్‌డమ్’. ఈ రెండు ప్రాజెక్ట్‌లతో పాటు మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి.

Also Read- Varalaxmi Sarathkumar: పెళ్లైన ఏడాదికే వరలక్ష్మి ఇలా చేసిందేంటి.. భర్త పరిస్థితేంటి?

ఇప్పుడీ భామను అఖిల్ ‘లెనిన్’ కోసం మేకర్స్ సెలక్ట్ చేశారు. ఆల్రెడీ శ్రీలీలతో చేసిన సన్నివేశాలను భాగ్యశ్రీపై చిత్రీకరిస్తున్నట్లుగా కూడా టాక్ నడుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లోకి భాగ్యశ్రీ చేరిందని తెలిసి, ఫ్యాన్స్ కూడా పిచ్చ హ్యాపీగా ఫీలవుతున్నారు. కారణం.. ఇప్పటికే శ్రీలీల చాలా సినిమాలు చేసి, ప్రేక్షకులకు బాగా నోటెడ్ అయింది. కానీ భాగ్యశ్రీ ఇండస్ట్రీకి కొత్త భామ. ఆమె చేసింది ఒక్క సినిమానే.. అందులోనూ అఖిల్ సరసన చాలా బాగుంటుందని వారంతా భావిస్తున్నారు. అందుకే శ్రీలీల పోతేనేం.. కత్తిలాంటి ఫిగర్ మా అఖిల్ సినిమాలో చేస్తుందని.. అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘లెనిన్’ సినిమా విషయానికి వస్తే.. అఖిల్ 6వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ’ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని రాబట్టుకున్న విషయం తెలిసిందే. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మ‌క‌మైన‌ది కాదు’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు