Youtube Age limit
Viral, లేటెస్ట్ న్యూస్

Youtube New Rules: రూల్స్ మార్చిన యూట్యూబ్… ఇకపై వారికి కుదరదు

Youtube New Rules: టీనేజర్ల లైవ్‌స్ట్రీమింగ్‌పై పర్యవేక్షణ, పరిమితులు విధించడమే లక్ష్యంగా వీడియో కంటెంట్ దిగ్గజం ప్లాట్‌ఫామ్ ‘యూట్యూబ్‌’ (Youtube New Rules) కీలక నిర్ణయం తీసుకుంది. జులై 22 నుంచి యూట్యూబ్ లైవ్‌స్ట్రీమింగ్ హోస్ట్‌ల కనీస వయస్సును 16 సంవత్సరాలకు పెంచింది. గతంలో 13 సంవత్సరాలుగా ఉండగా మూడేళ్లు హెచ్చిస్తూ కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. యువ కంటెంట్ క్రియేటర్లపై ఇంట్లో పెద్దవారి పర్యవేక్షణ కోసం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం,16 ఏళ్లలోపువారు స్వతంత్రంగా లైవ్‌స్ట్రీమింగ్ చేయడం ఇకపై నిషేధం. అలాగని పూర్తిగా కట్టడి చేయలేదని, పదహారేళ్ల కంటే తక్కువ వయసున్నవారు ఒక వయోజన వ్యక్తి (18 ఏళ్లు పైబడినవారు) సాయం చేసేందుకు అంగీకరిస్తే లైవ్‌స్ట్రీమింగ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వయోజన వ్యక్తి లైవ్‌స్ట్రీమింగ్‌కు సుముఖంగా ఉంటే, అతడికి ఎడిటర్‌గా, మేనేజర్‌గా లేదా యజమానిగా ఛానెల్‌ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. దీనినిబట్టి లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించాలంటే వయోజన వ్యక్తి ప్రారంభిస్తే మాత్రమే సాధ్యమవుతుంది. పెద్దవాళ్లు అకౌంట్‌ను మేనేజ్‌ చేస్తే మాత్రమే 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న కంటెంట్ క్రియేటర్లు  లైవ్‌స్ట్రీమింగ్‌‌ సాధ్యమవుతుంది.

Read this- Ali Khamenei: ఇరాన్ అధినేత అయతుల్లా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు

ఫ్యామిలీతో కలిసి చేయవచ్చు
యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం, పిల్లలు, కుటుంబాలు ఉమ్మడిగా ఎక్కువ సమయం గడిపేందుకు వీలు చిక్కుతుందని, తద్వారా కంటెంట్‌ను చక్కటి కంటెంట్ క్రియేట్ చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల లైవ్‌స్ట్రీమింగ్‌ను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ నిబంధనతో పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ పెరుగుతుంది. పిల్లల భద్రత, వారిపై పెద్దల బాధ్యత మెరుగుపడుతుంది. కుటుంబ కార్యక్రమాలకు సంబంధించిన కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

Read this- Tulbul project: పాక్‌పై భారత్ ‘తుల్‌బుల్’ అస్త్రం!

లైవ్‌స్ట్రీమింగ్‌లో ప్రైవసీ
యూట్యూబ్ కొత్త రూల్‌ను పాటిస్తే పిల్లలకు సైబర్ ముప్పు తగ్గింది. లైవ్‌స్ట్రీమింగ్ సమయంలో పిల్లల అనుచిత చర్యల నుంచి నియంత్రించవచ్చు. అంతేకాదు, ఆన్‌లైన్ స్కామ్‌ల నుంచి మైనర్లను రక్షించేందుకు వీలుకలుగుతుంది. మొత్తంగా పెద్దల ప్రమేయంతో యువ కంటెంట్ క్రియేటర్లు ఇబ్బందులు లేకుండా చక్కటి కంటెంట్ క్రియేట్ చేసేందుకు వీలుంటుంది. కాగా, కంటెంట్ క్రియేట్ చేసే విషయంలో కుటుంబాలకు కొన్ని పరిమితులు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత అంశాలను పబ్లిక్‌గా పంచుకునే విషయంపై కూడా నిబంధనలు ఉండాలని అంటున్నారు. పబ్లిక్ షేరింగ్‌ విషయంలో ఏయే అంశాలు అనుకూలంగా ఉన్నాయో, ఏవి ప్రైవేట్‌గా ఉండాలో నిర్ణయించుకోవాలని సూచించారు.

Read this- Manoj Manchu: తొలిసారి ‘కన్నప్ప’ కోసం అలాంటి పోస్ట్.. మనోజ్ పై నెటిజన్ల కామెంట్ల వర్షం

చిన్నచిన్న పిల్లలు సైతం ఇష్టం వచ్చినట్టుగా ఆన్‌లైన్ కంటెంట్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో యూట్యూబ్ ఈ నిబంధనను తీసుకొచ్చింది. పెద్దల మార్గనిర్దేశనం, పర్యవేక్షణ ఉంటే అన్ని విధాలా మంచిదని యూట్యూబ్ భావించింది. లైవ్ స్ట్రీమింగ్ విషయంలో పెద్దవాళ్ల పర్యవేక్షణ ఉంటే ఎంతోకొంత మార్పులు వస్తుందని యోచిస్తోంది. రూల్స్ పాటిస్తూనే మంచి కంటెంట్ క్రియేట్ చేసి ఆడియెన్స్‌తో పంచుకోవచ్చని చెబుతోంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!