Kavitha on CM Revanth (imagecredit:twitter)
తెలంగాణ

Kavitha on CM Revanth: అవినీతి చక్రవర్తి రేవంత్ రెడ్డి.. కవిత సంచలన కామెంట్స్!

Kavitha on CM Revanth: అవినీతి చక్రవర్తి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) అవినీతిపై త్వరలోనే పుస్తకం ప్రచురించి రాష్ట్రమంతా పంచుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్(Hyderabad) లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఒక నాయకుడి కరప్షన్ పై పుస్తకం వేశారని, రేవంత్ రెడ్డి అవినీతిలో చక్రవర్తి కాబట్టి ఆయన అవినీతిపై పుస్తకంలో సమగ్రంగా వివరిస్తామన్నారు. 18 నెలల్లోనే రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి రేవంత్ రెడ్డి కమిషన్లు మెక్కాడని ఆరోపించారు. కొత్తగా ఒక్క పథకం అమలు చేయకుండా, ఒక్క పింఛన్ మంజూరు చేయకుండా, పింఛన్లు పెంచకుండా, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వకుండా అప్పు తెచ్చిన రూ.2 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్(KCR) పాలనలో క్రమశిక్షణతో లోన్లు రీ పేమెంట్ చేసి ఏ గ్రేడ్ రేటింగ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని(Telangana State) రేవంత్ రెడ్డి డిఫాల్ట్ స్టేట్ స్థితికి దిగజార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యావైద్యం కుంటుపడిందన్నారు.

అప్పులు తిరిగి చెల్లించడానికే అప్పులు

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) నుంచి తెచ్చిన లోన్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరైన సమయానికి తిరిగి చెల్లించడం లేదన్నారు. ఇన్ స్టాల్ మెంట్ల పేమెంట్ లో డిఫాల్ట్ స్టేజీకి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని, అందుకు ఆర్ఈసీ రాసిన లేఖనే సాక్షమన్నారు. ఆధారాలు లేకుండా ఒక్క మాట మాట్లాడనని పూర్తి ఆధారాలతోనే ఈ విషయాలు బయట పెడుతున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాటకు ముందు కేసీఆర్(KCR) చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికే అప్పులు చేస్తున్నామని చెప్తున్నారని.. ఆయన చెప్పేవన్ని శుద్ధ అబద్ధాలని ఆర్ఈసీ(REC) లేఖతో తేలిపోయిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యంత ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించారని తెలిపారు. ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తెచ్చిన అప్పులను క్రమం తప్పకుండా రీ పేమెంట్Ree Payment) చేశారని వెల్లడించారు.

మొబిలైజేషన్ అడ్వాన్స్ ల సంస్కృతి

రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఈసీకి చెల్లించాల్సిన రూ.1,320 కోట్లను ఈనెల 28లోపు చెల్లించాలని లేఖ రాసిందని, సమయానికి రీపేమెంట్ చేయకపోతే దివాళాగా పరిగణించాల్సి వస్తుందని కూడా హెచ్చరించిందని అన్నారు. కేసీఆర్ పాలనలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించినా ఏ ఒక్క కాంట్రాక్టర్ కు మొబిలైజేషన్(Mobilization) అడ్వాన్సులు ఇవ్వలేదని కాంగ్రెస్(Congress) అధికారంలోకి రాగానే మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్స్ ల సంస్కృతి మొదలైందన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం అనే ప్రాజెక్టు కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థకు రూ.600 కోట్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Min Ponguleti Srinivass Reddy)కి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు మరో రూ.600 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. చెంచా మట్టి కూడా తీయకుండా ఒక్క ప్రాజెక్టుకే రూ.1,200 కోట్ల ముందస్తు చెల్లింపులు చేయడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: Jeedimetla Murder Case: తల్లిని చంపింది అందుకే.. వెలుగులోకి సంచలన నిజాలు

కేసీఆర్ పై బురద చల్లాలని

2024 జూలై 6న ప్రజాభవన్(Praja Bhavan) లో రేవంత్ రెడ్డితో సమావేశమైన తర్వాతే చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు(Banakacherla Project)ను తెరపైకి తెచ్చారన్నారు. 2016లో పోలవరం నుంచి బనకచర్ల లింక్ అనే ప్రాజెక్టు ప్రస్తావనే లేదన్నారు. రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారంతో కేసీఆర్ పై బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణ(Telangana)కు నష్టం చేయరన్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు లేదని ఆంధ్రా మేధావులు సైతం చెప్తున్నారని మేఘా ఇంజనీరింగ్(Mega engineering) సంస్థకు లాభం చేయడానికే ఈ ప్రాజెక్టు చేపట్టారని అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా పోలవరం – బనకచర్లపై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేయడం లేదన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే రేవంత్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు.

గోదావరి నీళ్లను గిఫ్ట్ ప్యాక్ గా

చంద్రబాబుకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బిర్యానీ తినిపించి గోదావరి నీళ్లను గిఫ్ట్ ప్యాక్ గా ఇచ్చారని అన్నారు. పోలవరం ముంపు సమస్యను చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రగతి ఎజెండాలో చేర్చి చివరి నిమిషంలో చర్చను ఎత్తివేసిందని మండిపడ్డారు. భద్రాచల రాముడు పోలవరంలో మునుగుతున్నా తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ(BJP) ఎంపీ(MP)లు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. వారికి పౌరుషం లేదని మండిపడ్డారు. భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు వెంటనే తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పూణే మెట్రో రైల్(Pune Metro Rail) కు కేంద్ర కేబినెట్ లో రూ.3,500 కోట్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని.. హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro Rail) ప్రాజెక్టుకు ఎందుకు నిధులు ఇవ్వలేదని నిలదీశారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలకు నిధులు తెచ్చే సత్తా లేదని మండిపడ్డారు.

Also Read: Shubhanshu Shukla: శుభాంశు శుక్లా ఏం చదివారు?, ఇంట్లో ఎలా ఉంటారో తెలుసా?

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్