Kuberaa: కొన్ని సినిమాలు ఎందుకు సక్సెస్ అవుతాయో చెప్పడం కష్టం. కానీ కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత కూడా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్‌గా మిగిలిపోతున్నాయి. దీనికి కారణం ఏంటి? అనేది చెప్పడం కూడా కష్టమే. ఇప్పుడు ‘కుబేర’ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ సినిమా విడుదలైన రోజు బీభత్సమైన పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. విశ్లేషకులు కూడా ఈ సినిమాకు 3 ప్లస్ రేటింగ్ ఇచ్చారు. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సినిమాపై పాజిటివ్‌గా స్పందించడంతో.. ఇంకేముంది, ‘కుబేర’ గట్టెక్కేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అక్కడ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పరిస్థితి వేరేలా ఉంది. కొన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు పడుతున్నప్పటికీ, ఈ సినిమా బడ్జెట్‌ను రికవరీ చేయడం కష్టమే అనేలా ట్రేడ్ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. ఇక తమిళనాడులో ఈ సినిమా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.
Also Read- OTT Controversy: వెబ్ సిరీస్ కూడా కాపీ.. కాంట్రవర్సీలో ‘కానిస్టేబుల్ కనకం’.. మ్యాటరేంటంటే?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఇందులో మెయిన్ పాత్రని పోషించినప్పటికీ సరైన ఓపెనింగ్స్ కూడా ఈ సినిమా సాధించలేకపోవడం విశేషం. అక్కడ రూ. 18 కోట్లకు ఈ సినిమాను కొంటే, రూ. 8 కోట్లు వచ్చినా గొప్పే అంటున్నారు. దాదాపు రూ. 10 కోట్లు తమిళనాడు (Tamil Nadu) బెల్ట్‌లో లాస్ వస్తుందనేలా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలలోనూ ఈ సినిమాకు అనుకున్నంతగా కలెక్షన్లు లేవు. మౌత్ టాక్ బాగున్నప్పటికీ, అది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతుంది. కారణం ఏమిటనేది పక్కన పెడితే.. ఇంత పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ నిర్మాతలకు ఇది లాస్ ప్రాజెక్టే అవుతుందనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 శాతం వరకు ఈ సినిమాకు నష్టాలు వస్తాయని, ఒక్క ఈస్ట్ గోదావరి బెల్ట్‌లోనే రూ. 60 లక్షల వరకు పోతాయనేలా టాక్ వినబడుతుంది. అందులోనూ ఈ వారం పాన్ ఇండియా సినిమాగా ‘కన్నప్ప’ విడుదలవుతుండటంతో.. నష్ట శాతం ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు.
Also Read- Varalaxmi Sarathkumar: పెళ్లైన ఏడాదికే వరలక్ష్మి ఇలా చేసిందేంటి.. భర్త పరిస్థితేంటి?
‘కన్నప్ప’ రిజల్ట్‌పైనే ఆశలు
ఈ వారం బాక్సాఫీస్‌ను పలకరించబోతున్న ‘కన్నప్ప’ (Kannappa) పైనే ‘కుబేర’ ఆశలు పెట్టుకున్నాడు. ‘కన్నప్ప’ సినిమా రిజల్ట్ కనుక తేడా కొడితే ‘కుబేర’ సినిమాకు కలిసొస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. అలా జరిగితే ‘కుబేర’ గురించి మాట్లాడుకునేలా మరో ప్రయత్నం కూడా వారు చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘కన్నప్ప’ టాక్ కనుక వీక్‌గా ఉంటే.. వెంటనే ‘కుబేర’లో మరో సాంగ్‌ని యాడ్ చేస్తారట. ‘పీపీపీ డుండుండుం’ అనే సాంగ్‌ని యాడ్ చేసి.. ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టాలని ‘కుబేర’ టీమ్ ప్లాన్ చేస్తుంది. ఏది ఏమైనా ‘కుబేర’ భవిష్యత్ మాత్రం ‘కన్నప్ప’ రిజల్ట్ పైనే ఆధారపడి ఉంది. చూద్దాం.. ఏం జరుగుతుందో? ధనుష్ (Dhanush), నాగార్జున (King Nagarjuna), రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబోలో వచ్చిన ‘కుబేర’ చిత్రాన్ని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) రూపొందించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు