Chiranjeevi
Viral

Chiranjeevi: ప్లీజ్.. చిరంజీవి ఇజ్జత్ తీయకండ్రా!

Chiranjeevi: అవును.. కొన్నిసార్లు అభిమానులు చేసే పిచ్చి పనులు, చేష్టలు హీరోలు, రాజకీయ నేతలకు చికాకు తెప్పిస్తుంటాయి. ‘ మీకు దండం పెడతా ఆపండ్రా..’ అని ఎంతోమంది బహిరంగంగానే చెప్పిన సందర్భాలు కోకొల్లలు. ముఖ్యంగా ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గురించి లేనిపోని వార్తలు, అంతకుమించి పుకార్లు తెగ పుడుతున్నాయి. అరే బాబు తనకు ఎలాంటి సంబంధం లేదని పదే పదే చెబుతున్నప్పటికీ అభిమానులు మాత్రం అస్సలు తగ్గట్లేదు. రెండ్రోజులకోసారి ఏదో ఒక హడావుడి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాజకీయాల జోలికి ఇప్పుడు.. ఎప్పుడూ రానంటే రానని ఇక సినిమాలే సర్వస్వం అని క్లియర్ కట్‌గా తేల్చి చెప్పినప్పటికీ ‘అదిగో వచ్చేస్తున్నాడు.. ఇదిగో వచ్చేశాడు’.. ఫలానా పదవి ఇచ్చేస్తున్నారు ఇంకేముంది ఆహా, ఓహో అనే వాళ్లు ఈ మధ్య ఎక్కువైపోయారు. ఇంకొందరైతే ‘బీజేపీ చేరిపోతున్నారు.. ఉపరాష్ట్రతి పదవి వచ్చేస్తోంది.. అధికారిక ప్రకటనే తరువాయి’ అని ఓ రేంజిలో రచ్చ రచ్చ చేసేశారు. వాస్తవానికి ఆ మధ్య బీజేపీ కార్యక్రమాలకు కాస్త దగ్గరవ్వడంతో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓ సభావేదికగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశానని తేల్చి చెప్పేశారు. నాటి నుంచి నిన్న, మొన్నటి వరకూ చిరును పాలిటిక్స్‌లోకి లాగలేదు కానీ.. ఇవాళ మరో కొత్త ప్రచారం మొదలైంది.

Read Also- Thaman: ‘అడ్రస్ పెట్టు రా వచ్చి నేర్చుకుంటా’.. దెబ్బకు దిమ్మతిరిగిపోలా!

ఎందుకిలా..?
‘ భారత రాష్ట్రపతిగా శ్రీ కొణిదల చిరంజీవి గారు అని విశ్వసనీయ సమాచారం. ఇదే నిజమైతే ఉంటదిరా చారి’ అంటూ మెగాభిమాని ఒకరు ఎక్స్ వేదికగా చేసిన పోస్టు చేశాడు. దీనికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూర్చొని ఉన్న ఫొటోను జతచేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇన్నాళ్లు చిరును ఎవరూ టచ్ చేయలేదురా బాబూ అంతా ప్రశాంతమే అనుకున్న సమయంలో మెగాభిమాని ఇలా పోస్టు చేయడంతో.. అసలేం జరుగుతోంది? ఈ పదవుల కథేంటి? అని తెలుసుకోవడానికి మెగాభిమానులు, జనసైనికులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక చిరు.. డై హార్డ్ ఫ్యాన్స్ అయితే గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు. ‘తమరి నోరు కాస్త మూస్తే బాగుంటుంది.. ఎందుకు రా బాబూ గోల చేస్తున్నారు’ అని కౌంటర్ ఇస్తున్నారు. మరికొందరు వీరాభిమానులు అయితే.. ‘ ప్లీజ్.. చిరంజీవి ఇజ్జత్ తీయకండ్రా’ అని సలహా ఇస్తున్నారు. ఇక వేరే హీరోల అభిమానులు, వేరే పార్టీల కార్యకర్తలు సైలెంట్‌గా ఉంటారా చెప్పండి.. ‘ ఓహ్ చిరు రాష్ట్రపతి అయితే పవన్ ప్రధాని మంత్రా’ ఎందుకురా పగటి కలలు కంటున్నారు.. లెగు బాబూ లెగు అంటూ డీజే టిల్లు మీమ్‌ను పోస్ట్ చేస్తున్నారు.

ఆషామాషీనా..?
వాస్తవానికి ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి కావడం అంత ఆషామాషీ విషయం ఏమీ కాదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే చిరంజీవి రాజకీయ, రాజకీయేతర పదవుల్లో ఉండటానికి అంత ఆసక్తిగా లేరు. అంతేకాదు.. అవకాశాలు వచ్చే పరిస్థితులు కూడా దరిదాపుల్లో లేనే లేవు. రాష్ట్రపతి ఎన్నిక అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు (లోక్‌సభ, రాజ్యసభ).. రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఓటు వేస్తారు. రాష్ట్రపతి అభ్యర్థికి ప్రధాన రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పక్షం.. దాని మిత్రపక్షాల మద్దతు అవసరం ఉంటుంది. గెలవడానికి, అభ్యర్థికి నిర్దిష్ట సంఖ్యలో ఓట్లు (కోటా) రావాలి. ఇది మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 50% + 1 ఓటుగా లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కోటా రాకపోతే, అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగించి, వారి రెండవ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియ ఒక అభ్యర్థికి అవసరమైన కోటా వచ్చే వరకు కొనసాగుతుంది. చిరంజీవికి అలాంటి విస్తృతమైన రాజకీయ మద్దతు ప్రస్తుతం లేదు. చిరు ఎప్పుడో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని సినిమాలపైనే దృష్టి సారించారు. ప్రస్తుతం ఆయనకు ఏ ప్రధాన పార్టీలోనూ క్రియాశీలక పదవి లేదు.. ఉండనని కూడా చెప్పేశారు. సో.. ఇకనైనా మెగాస్టార్‌పై ఇలాంటి ప్రచారాలు, లేనిపోని ఊహాగానాలు సృష్టించకుండా ఉంటే మంచిది సుమీ..!

Read Also- YSRCP: సీన్ రివర్స్.. టీడీపీ నుంచి వైసీపీలోకి కీలక నేత

 

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?