Student Commits suicide: చుంచుపల్లి మండలంలో గల ఎస్.ఆర్ డి.జె స్కూల్(SRDJ School)) నందు చదువుతున్న విద్యార్థి(Student)ని పాఠశాల ఉపాధ్యాయులు హోం వర్క్ చేయలేదని మందలించడంతో విద్యార్థి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడటంతో కొత్తగూడెం(Kothagudem)లో చర్చనీయాంశంగా మారింది. స్కూల్ యాజమాన్యం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చుంచుపల్లి మండలంలో ఎస్.ఆర్ డి.జె పాఠశాలలో చదువుతున్న 10 వ తరగతి విద్యార్థి హోం వర్క్ చేయలేదని మంగళవారం ఉపాధ్యాయులు మందలించడం జరిగిందని తెలిపారు. మనస్తాపానికి గురైన విద్యార్థి ఇంటి వద్దనే ఎలుకలు వంటి కీటకాలు చంపే మందుని తాగి బుధవారం స్కూల్ బస్సు(School Bus) ఎక్కాడని బాధిత విద్యార్థి తెలిపాడని అన్నారు.
Also Read: Samvidhan Hatya Diwas: బీజేవైఎం ఆధ్వర్యంలో యువజన సమ్మేళనాలు.. మనోహర్ రెడ్డి
తోటి విద్యార్థుల ద్వారా సమాచారం
బస్సులో ఉన్నటువంటి తోటి విద్యార్థుల ద్వారా సమాచారం తెలిసిన వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించి తక్షణమే చుంచుపల్లి మండలంలో గల హాస్పిటల్(Hospital) నందు వైద్యం అందించే ప్రయత్నం చేశామన్నారు. తల్లిదండ్రుల కొరినట్లుగానే కొత్తగూడెం(Kothagudem) లోని ప్రముఖ హాస్పటల్ కి తీసుకు వెళ్లినట్లుగా తెలిపారు. ప్రస్తుతానికి విద్యార్థి ఆరోగ్యం బాగానే ఉందని అన్నారు. మెరుగైన వైద్యం అందించాలని విద్యార్థి తల్లిదండ్రులు హైదరాబాద్(Hyderabad) తీసుకు వెళ్తున్నట్లు సమాచారం ఉందన్నారు.
కక్షసాధింపు చర్యలు ఉండవు
బాగా చదివి విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండాలనే ఆశించి బాగా చదవాలని చెప్పేందుకు మాత్రమే విద్యార్థులను మందలించడం జరుగుతుందని ఎస్.ఆర్ డి.జె స్కూల్(SRDJ School) సిబ్బంది పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ మెరుగు పడాలనే చూస్తామని ఏ యొక్క విద్యార్థిపై కక్షసాధింపు చర్యలు పాఠశాలలో ఉండవని ఎస్.ఆర్ డి.జె పాఠశాల జోనల్ ఇంచార్జ్ సతీష్ అన్నారు.
Also Read: Jagadish Reddy: గోదావరి, బనకచర్లపై అన్ని పార్టీలు ఏకం కావాలి.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి