CM Revanth Reddy: పార్టీ పదవులతోనే గొప్ప అవకాశాలు లభిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. చిన్న చూపుగా చూడొద్దన్నారు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం, మినిస్టర్లుగా ఎందరో పార్టీ నుంచే ఎదిగారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పార్టీలో పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తే పదవులు వచ్చి తీరుతాయన్నారు. ఆయన పీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ (Congress Party) బాధ్యతల తోనే తనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు.
గతంలో పార్టీలో పనిచేసిన వాళ్లలో 65 మందికి ప్రభుత్వంలో పదవులు లభించాయన్నారు. త్వరలో మరి కొందరికి వస్తాయన్నారు. అయితే, స్థానిక సంస్థలు త్వరలోనే రానున్నాయని, ఇప్పటి వరకు లీడర్లను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేశారని, ఇక క్షేత్రస్థాయి ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యతను లీడర్లు తీసుకోవాలన్నారు. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ (Congress Party) పవర్‌లో ఉంటుందని, అందరికీ న్యాయం జరిగేలా చొరవ తీసుకుంటానని చెప్పారు. పార్టీ నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.
Also Read: CM Revanth Reddy: కల్వకుంట్ల ఫ్యామిలీకి వేల కోట్లు ఎక్కడివి?.. సీఎం సంచలన కామెంట్స్!
ఏడాదిలో 60 వేల ఉద్యోగాల భర్తీ
కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తాము 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 18 నెలల్లో రైతుల కోసం లక్షా నాలుగు వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం రైతుల కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయలేదన్నారు. విద్యార్థులకు 200 శాతం కాస్మెటిక్ ఛార్జీలు,40 శాతం డైట్ ఛార్జీలు పెంచామన్నారు. 100 ఏళ్ల కుల గణన కలను నెరవేర్చామన్నారు. ((Telangana) తెలంగాణను చూసి దేశం కూడా జనగణనకు నిర్ణయం తీసుకున్నదన్నారు. కేంద్రం మెడలు వంచి దేశంలో కులగణన చేపట్టాలని ఒత్తిడి తెచ్చామన్నారు.
ఇక, ఎస్సీ వర్గీకరణ కోసం 35 ఏండ్ల నుంచి పోరాటం జరిగిందన్నారు. అనేక మంది త్యాగాలు చేశారన్నారు. కానీ, తమ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ వర్గీకరణ చేసి సమస్యకు పరిష్కారం చూపించామన్నారు. పెట్టుబడుల కోసం (Telangana Rising) తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చామన్నారు. మరోవైపు 18 నెలల పాలన గోల్డెన్ పీరియడ్ అని, ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా నాయకులు ఉండాలన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనకు, 18 నెలల కాంగ్రెస్ పాలనకు బహిరంగ చర్చకు సవాల్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. 18 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందో? అన్ని గ్రామాల్లోకి చేరవేయాలని సీఎం వివరించారు.
Also Read: BRS Party: సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు కసరత్తు!