SLBC Tunnnel Collapse: ఎస్ఎల్బీసీ(SLBC) కుప్పకూలిందని దానిపై విచారణ చేయించే ధైర్యం కేంద్ర మంత్రిబండి సంజయ్(Bandi Sanjay)కి ఉందా? అని మాజీ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) సవాల్ చేశారు. తెలంగాణ భవన్ లో మాజీ ఎంపీ వినోద్ కుమార్(Vinodh Kumar), ఎమ్మెల్యే సంజయ్(Sanjey), ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(Dhasoju Srevan)తో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్(Congrss), బీజేపీలు(BJP) కలసి పనిచేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ చెప్తోన్న వాటినే కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్తున్నారని విమర్శించారు. మేడిగడ్డకు మర మత్తులు చేయాలని కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్ లు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ కు నీళ్ళు పంపే ప్రయత్నం
రేవంత్(Revantyh Reddy), కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్ లు ఆంధ్రప్రదేశ్(AP) కు నీళ్ళు పంపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజక్టుపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కార్యకర్త మాదిరి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్, అర్వింద్ లు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారన్నారు. బండి సంజయ్ కు దమ్మంటే కాళేశ్వరం ప్రాజక్టుకు జాతీయహోదా ఇప్పించి మాట్లాడాలని సవాల్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని ఎన్డీఎస్ఏ చెప్పిన విషయాన్ని బండి సంజయ్ గుర్తుంచుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజక్టు వలనే తెలంగాణ సస్యశామలమైందన్నారు.
Aslo Read: By Polls 2025: ఉపఎన్నికల్లో మారిపోయిన ఆప్, బీజేపీ ముఖచిత్రాలు
అసత్యాలు ప్రచారం
సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం నడుస్తుందా? ఎన్డీఏ(NDA) ప్రభుత్వం నడుస్తుందా? అనే అనుమానం వస్తుందన్నారు. 38 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష 24 కోట్ల రూపాయలకు పెంచారని సంజయ్ నిరాధార ఆరోపణ చేశారన్నారు. కాళేశ్వరంతో ఆయకట్టు పెరిగింది. రిజర్వాయర్లు పెరిగాయి. రోజూ లిఫ్ట్ చేసే సామర్థ్యం 3 టీఎంసీ లకు పెరిగిందన్నారు. దేశంలో ఎన్నో పెద్ద ప్రాజెక్టుల కన్నా కాళేశ్వరం ప్రాజెక్టు కు తక్కువ ఖర్చు అయిందన్నారు. లక్ష కోట్ల కన్నా తక్కువ ఖర్చు అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అంటారా ? అని నిలదీశారు.
మేడిగడ్డ దగ్గర రిపేర్ చేయమని కోరితే
పోలవరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇచ్చారు అక్కడ డయాఫ్రామ్ వాల్ కొట్టుకు పోయింది . కేంద్ర ప్రభుత్వం ఇజ్జత్ పోలేదా ? అని నిలదీశారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్(NDSA Report) మేడిగడ్డ దగ్గర పిల్లర్ల ను రిపేర్ చేయొచ్చని చెప్పిందన్నారు. రేవంత్(Revanth) పాలనలో ఎస్ ఎల్ బీసీ(SLBC) కుప్ప కూలింది. సుంకి శాల దెబ్బతిన్నది. వట్టెం మునిగిపోయింది. పెద్ద వాగు(Pedda Vagu) పెట్టుకుపోయింది. బీజేపీ ఎందుకు విచారణ కోరదు? అని నిలదీశారు. బీజేపీ కాంగ్రెస్ మైత్రి బంధం బలపడ్డదని, అందుకే రేవంత్ ప్రభుత్వ తప్పిదాలని బీజేపీ ప్రశ్నించడం లేదని ఆరోపించారు. బండి మేడిగడ్డ దగ్గర రిపేర్ చేయమని కోరితే తెలంగాణ ప్రజలు సంతోషించే వాళ్ళు అన్నారు. మేడిగడ్డ ను రిపేర్ చేయకుండా గోదావరి నీళ్లు కిందకు పంపించడమే బండి సంజయ్ ఉద్దేశమా ? అని ప్రశ్నించారు. మంత్రిగా మాట్లాడితే అర్థం ఉంటుంది. సంజయ్ ఓ బీజేపీ కార్యకర్తగా మాట్లాడితే ఇలాంటి అబద్దాలే వస్తాయన్నారు.
Also Read: Mega Brothers: పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవికి ఏమైంది.. ఇప్పుడెలా ఉంది?